బాహుబలి 3 కూడా వుంటుందట

దర్శకుడు రాజమౌళి మరో సంచలనానికి తెర తీసాడు. బాహుబలి అన్నది పార్ట్ వన్, టూ అనే ఎండింగ్ ప్రాసెస్ కాదని, పార్ట్ త్రీ కూడా వుండే అవకాశం వుందని అన్నారు. అయితే అది సినిమా రూపంలో వుంటుందా లేక, వేరే విధంగా వుంటుందా అన్నది ఇప్పుడు చెప్పలేనన్నారు. 

కానీ, బాహుబలి 3 అన్నది కచ్చితంగా ఏదో రూపంలో వుంటుందని ఆయన వెల్లడించారు. కార్టూన్ ఫిల్మ్ ల మాదిరిగా ఏనిమేటెడ్ సిరీస్ కూడా కావచ్చునన్నారు. అయితే దాని కథ వేరు అని, దానికి బాహుబలి సినిమా కథకు సంబంధం వుండదన్నారు. కార్టూన్ సీరీస్ మాదిరిగా బాహుబలి ఏనిమేటెడ్ సీరీస్, వేరే కథలతో కంటిన్యూ కావచ్చు. అయితే తాను లేకున్నా కూడా బాహుబలి సిరీస్ కంటిన్యూ కావాలన్నది తన కోరిక అన్నారు. 

బాహుబలి తరువాత తను మళ్లీ ఆ సినిమా మీద మాత్రం వుండకపోవచ్చు అని కూడా రాజమౌళి వెల్లడించారు. అయితే బాహుబలి పార్ట్ 2 సినిమాకు సంబంధించినంత వరకు అందరు నటులు కూడా డిసెంబర్ తో ఫ్రీ అయిపోతారని రాజమౌళి చెప్పారు. బాహుబలి 2 సినిమాను ఒక నెల ముందుగానే వర్చ్యువల్ రియాల్టీ ఫార్మ్ లో విడుదల చేస్తామన్నారు. అందుకోసం థియేటర్ల దగ్గర గూగుల్ కార్డ్ బాక్స్ ల ఏర్పాటు వుండే అవకాశం వుంటుందన్నారు.

తమన్నాకు నో సాంగ్

బాహుబలి 2లో తమన్నా హీరోయిన్ కాదని అనుష్క హీరోయిన్ అని రాజమౌళి వెల్లడించారు. అందువల్ల తమన్నా మీద సాంగ్ ఏదీ వుండదని ఆయన వెల్లడించారు. 

Show comments