సింగం 3 వాయిదా పడడంతో, మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమా వన్ వీక్ ముందుకు వచ్చింది. ధృవ సినిమా విడుదలైన వారానికి సింగం 3 ను రాకుండా చేసారు కానీ, చిన్న సినిమాలు ధైర్యం చేయడం విశేషం. పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'.
ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ఈనెలలోనే చిత్రాన్ని రిలీజ్ చెయ్యాల్సి వుండగా, డేట్ ల అడ్జస్ట్ మెంట్ సమస్యను దృష్టిలో వుంచుకొని డిసెంబర్ 16న ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని నిర్ణయించాం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్స్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన ఆడియో కూడా సూపర్‌హిట్ అయింది. తప్పకుండా మా బేనర్‌లో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది'' అన్నారు.
పృథ్వీ, నవీన్‌చంద్ర, సలోని, శృతి సోధి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్, పిల్లా ప్రసాద్, గిరి, సన, విద్యుల్లేఖా రామన్, మీనా, నేహాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., కథ, మాటలు: నాగేంద్రకుమార్ వేపూరి, కథా విస్తరణ: విక్రవమ్‌రాజ్, డైలాగ్స్ డెవలప్‌మెంట్: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: కిరణ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.