పంద్రాగస్టు కానుకగా పవన్ సినిమా ఫస్ట్ లుక్?

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవన్. మూవీ ప్రారంభమై ఇన్ని రోజులైనా ఇప్పటివరకు టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న పవన్-త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారట. త్వరలోనే దీనిపై ఓ అపీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది.

పవన్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి కేవలం ఫస్ట్ లుక్ విడుదల చేస్తారా.. లేక ఆ లుక్ తో పాటు టైటిల్ కూడా ఎనౌన్స్ చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. పరదేశ ప్రయాణం, ఇంజినీర్ బాబు లాంటి టైటిల్స్ వినిపించాయి. అయితే గోకుల కృష్ణుడు అనే టైటిల్ పై ఎక్కువ బజ్ నడుస్తోంది. 

పవన్ కు ఇది ప్రతిష్టాత్మక 25వ సినిమా కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలో పవన్ కు అసిస్టెంట్ గా కనిపించనుందట అను ఎమ్మాన్యుయేల్. సీనియర్ నటి ఖుష్బూ మరో కీలక పాత్రలో కనిపించనుంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. 

ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపుగా పూర్తిచేసుకుంది పవన్ సినిమా. అటుఇటుగా 150 కోట్ల రూపాయలకు బిజినెస్ ముగిసేలా కనిపిస్తోంది. బాహుబలి-2 తర్వాత భారీస్థాయిలో బిజినెస్ జరిగిన సినిమాగా నిలిచింది పవన్-త్రివిక్రమ్ మూవీ.

Show comments