బ్రేకింగ్ న్యూస్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రాజీనామా చేశారు. తదుపరి అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకోనున్నారు. ఏందిరా వీడికేమన్నా మతి పోయిందా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతన్నారనుకుంటున్నారా? ఇది వింటే నాకే కాదు మీకు కూడా మతి పోతుంది. అంత గొప్ప విషయం మరి.. ఇంతకీ కథేంటంటే చిత్తూరు జిల్లా పుత్తూరులో విజ్జాన్ ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవానికి సీఎం చంద్రబాబు పుత్ర సమేతంగా హాజరయ్యారు. అక్కడ బాబుగారు తన సహజ ధోరణిలో బోలేడు చెప్పాడులెండి.. ఐటీ అనేది మన జీన్స్‌లోనే ఉందని, డీఎన్ఏ జావా కోడ్‌తో తయారయిందని.. రక్తంలో లాంగ్వేజీలో ప్రవహిస్తుంటాయని ఇలా.. సరే ఆయన స్వభాషితాలు అయ్యాక.
కుమారుడు లోకేశ్ మైకు అందుకుని అందరికీ ఉసుగొలిపే విషయం ఒకటి చెప్పాడు. ఏంటంటే మొన్నఏపీలో పెట్టుబడులు, పరిశ్రమలు రాబట్టేందుకని చంద్రబాబు ఓ వారం రోజులు అమెరికాలో సుడిగాలి పర్యటనలు చేశాడు కదా.. అప్పుటట అక్కడ ఉన్న అమెరికా వాళ్లు మీ బాబు అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తారా అని అడిగారట.. ఆ విషయాన్ని అక్కడున్న వాళ్లు విని ఆశ్చర్యపోయారట.. అసలు ఆ అమెరికా వాడు ఏ ఉద్ధేశంతో అడిగాడో.. ఈ చినబాబు బుర్రకు ఏం అర్థమయిందో.. దాన్ని తీసుకొచ్చి కాలేజ్ పిల్లోళ్ల ముందు చెప్పడమేమిటో.. ఈ చినబాబు గారు అమెరికాలోనే కదా చదువుకొని వచ్చారు.. మరి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే ఏ అర్హతలు ఉండాలో ఆయననకు తెలియదా.. అమెరికా పౌరసత్వం ఉండొద్దా.. మరీ ఈ స్థాయిలో గొప్పలు చెప్పుకోవడమేమేటని సభికులంతా నోరెళ్లబెట్టారట. ఇప్పడు చెప్పండి ఎవరికండీ పిచ్చి.
సరే ఇంతకీ మన బాబు అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తారా అన్న అనుమానం ఆ పిచ్చి అమెరికన్లకు ఎందుకు కలిగిందా అని కొంత ఆరాతీస్తే తెలిసిన విషయమేంటంటే.. పెట్టుబడులు కోసం అక్కడికి వెళ్లిన బాబు చేసిన హంగు, ఆర్భాటమే అందుకు కారణం అని తేలింది. నలుగురు అధికారులు, ప్రతినిధులను తీసుకెళ్లి నాలుగు కంపెనీల అధినేతలను కలిసి ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండని హుందాగా ఆహ్వానించాల్సింది పోయి ఈయనగారు అక్కడ ఏదక్ష ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించినట్టు వందల మంది మూకను వెంటేసుకుని తిరగాడట.
పార్టీ మీటింగ్‌ల లాగా కొందరు పచ్చ జెండాలు ఒంటికి కప్పుకుని చంద్రబాబు కాన్వాయ్‌ను అనుసరించారట. ఇదంతా చూసి ఏందీ అల్లరి ఇక్కడేమైనా ఎన్నికలు జరుగుతున్నాయా? అమెరికా అధ్యక్షుడిగా బాబు పోటీ చేస్తున్నారా? మరేంటి ఈ హడావుడి అని ఒళ్లు మండిన కొందరు అమెరికన్లు వెటకరించారట... దాన్ని పట్టుకొచ్చి మన చినబాబు తనకు అనుకూలంగా ఎంత బాగా అన్వయించుకున్నాడో చూడండి.. వెటకారాన్ని కూడా పొగడ్తగా మార్చుకోగల నేర్పు సాధించాడంటే తండ్రి తగ్గ తనయుడే అని జనం చెవులు కొరుక్కుంటున్నారు.