తెలుగు రాష్ట్రాల్లో ఓ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి రావాలంటే నైజాంలో కచ్చితంగా క్లిక్ అవ్వాల్సిందే. విస్తీర్ణం, థియేటర్ల పరంగా ఈ ఏరియా టాలీవుడ్ కు చాలా కీలకం. అందుకే ఏ సినిమా విడుదలైనా ఫస్ట్ ఆరా తీసేది నైజాం లెక్కలే. అలాంటి కీలకమైన నైజాం ఏరియాలో బాహుబలి – ది కంక్లూజన్ సినిమా చరిత్ర సృష్టించింది.
మంగళవారం ఈ సినిమాకు 2కోట్ల 20లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ మొత్తంతో ఈ 12 రోజుల్లో బాహుబలి-2 సినిమా నైజాంలో 50కోట్ల 10 లక్షల రూపాయల షేర్ సాధించింది. టాలీవుడ్ లోనే ఇదొక రికార్డు. ఓ సినిమాకు నైజాంలో 50కోట్ల షేర్ ఇప్పటివరకు రాలేదు.
బాహుబలి-2 విడుదలై జస్ట్ 12 రోజులు మాత్రమే అయింది. మరో వీకెండ్ కూడా వస్తోంది. ఫైనల్ రన్ కు ఇంకా చాలా టైం ఉంది. సో.. ఈ టైమ్ లో నైజాంలో ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం. ఈ 12 రోజుల్లో వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 1200 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.