పెళ్లి చూపులు సినిమాతో ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. అనుకోకుండా షార్ట్ ఫిలిమ్ స్ఫూర్తితో పెళ్లి చూపులు స్క్రిప్ట్ రెడీ చేసుకున్న తరుణ్ తన తరువాత సినిమాకు కూడా అదే పని చేయబోతున్నాడు. గతంలో తనకు పేరు తెచ్చిన సైన్మా షార్ట్ ఫిలిమ్ ను ఫుల్ సైజ్ ఫీచర్ ఫిల్మ్ గా మారుస్తున్నాడు.
దీనికి రాజ్ కందుకూరి సోలో నిర్మాత. పూర్తిగా కొత్తవాళ్లు నటిస్తారు. సైన్మా సినిమా యూ ట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్ గా బాగా పాపులర్. తెలంగాణ పల్లెలో, అక్కడి స్లాంట్ తో నడిచే చిన్న కాన్సెప్ట్ ఫిల్మ్ అది. దాన్నే పూర్తి నిడివికి మార్చడంలో తరుణ్ ఇప్పుడు బిజీగా వర్క్ చేస్తున్నారు.
బహుశా వన్స్ కొత్తవాళ్లందరినీ ఫిక్స్ చేసుకున్న వెంటనే సినిమా సెట్ మీదకు వెళ్తుంది. ఈ సినిమా కూడా వన్ క్రోర్ బడ్జెట్ తోనే ఫినిష్ చేస్తారు. మరి సూపర్ హిట్ ఇచ్చిన తరుణ్ కు రెమ్యూనిరేషన్ మాత్రం సెపరేట్ గా వుంటుందేమో? ఎంత ముందటి అగ్రిమెంట్ వున్నా?