బాలకృష్ణ ఈగోతో శాతకర్ణికి ఇబ్బందులు

సంక్రాంతికి చిరంజీవి 150వ చిత్రం రిలీజ్‌ అవుతోంది కనుక తన వందవ చిత్రాన్ని కూడా అదే సమయానికి రెడీ చేయాలని బాలకృష్ణ పట్టుబట్టారట. గౌతమిపుత్ర శాతకర్ణి చారిత్రిక చిత్రం కావడంతో గ్రాఫిక్స్‌కి సమయం పడుతుందని చెప్పినా బాలయ్య వినడం లేదట. హీరో మాట కాదనలేక సంక్రాంతికే సినిమాని సిద్ధం చేసే ఉద్దేశంతో క్వాలిటీపై కాంప్రమైజ్‌ అయిపోతున్నట్టు భోగట్టా. 

ఇంటర్నేషనల్‌ టెక్నీషియన్స్‌తో చేయించాల్సిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ని లోకల్‌ కుర్రాళ్లతో కానిచ్చేస్తున్నారట. కథాంశ పరంగా ఇప్పటికే సినీ ప్రియులని ఈ చిత్రం అమితంగా ఆకర్షిస్తోంది. ఇలాంటి చిత్రాన్ని మంచి క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకి తేవాలని క్రిష్‌ భావిస్తున్నాడు. కానీ అతనికి బాలకృష్ణ నుంచి సహకారం అందడం లేదట.

లేనిపోని ఈగోలకి వెళ్లి సినిమా ఎలా తయారైనా ఫర్వాలేదు కానీ సంక్రాంతికి రిలీజ్‌ చేయాల్సిందే అంటున్నారట. ఇంతకుముందు ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో' చిత్రంపై పోటీగా 'డిక్టేటర్‌'ని విడుదల చేయించిన సంగతి తెలిసిందే. శాతకర్ణికి బాహుబలి స్థాయిలో హైప్‌ తేవడానికి ట్రెయిలర్‌ని సినిమా థియేటర్లలో విడుదల చేసే కార్యక్రమం చేపట్టారు. బాహుబలిని పబ్లిసిటీ పరంగా కాపీ చేస్తే సరిపోతుందా? క్వాలిటీ ఆ రేంజ్‌లో ఉండొద్దా?

Show comments