ఫొటో తీసేస్తే సరిపోతుందా లోకేష్ బాబూ?

ఒకవైపు హోం మంత్రి చినరాజప్ప ఏమో.. చినబాబు నన్నేమీ అన్లే.. నన్నేమీ అవమానించలే.. అంటుంటే, తెలుగుదేశం వీరాభిమానులు కూడా లోకేష్ ది తప్పేం లేదని తీర్పులిస్తున్న తరుణంలో.. మరోవైపు అసలు ఫొటోను మాయం చేసే పనిలో పడ్డాడు చిన్నబాబు. ఏ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా అయితే ఈ ఫొటో వెలుగు  లోకి వచ్చిందో.. దాన్నుంచి ఆ ఫొటోను డిలీట్ చేశారు!

ఈ విధంగా మరోసారి దొరికిపోయారు. అసలు ఆ ఫొటోలో తప్పేం లేనప్పుడు.. ఆ వాదనను వినిపిస్తున్న వాళ్లే ఆ ఫొటోను డిలీట్ చేశారంటే, తామెంత అహంభావాన్ని ప్రదర్శించామో వారికే అర్థం అయినట్టుంది. 

ఈ విధంగా డ్యామేజ్ కంట్రోల్ కు దిగాడు లోకేష్ బాబు. మరి అవతల మనిషి హోదాకు కాకపోయినా కనీసం వయసుకు అయినా విలువనివ్వాల్సింది పోయి, ఏదో హెడ్మాస్టార్ లా ప్రవర్తించి, ఆదేశాలు జారీ చేసిన లోకేష్ ఫొటోను డిలీట్ చేస్తే డ్యామేజ్ కంట్రోల్ చేసేసినట్టుగా భావిస్తున్నాడు కాబోలు!

అడుసు తొక్కనేల.. కాలు కడగనేలా.. అన్నట్టుగా, చేయాల్సిందంతా చేసి ఇలా డ్యామేజీ కంట్రోల్ కు ప్రయత్నిస్తున్నాడు చంద్రన్న తనయుడు. 

అయినా… ఎంత అధికారం ఉన్నా ఇంత అహం పనికి రాకపోవచ్చు. ఎంత చంద్రబాబు తనయుడు అయినా.. ఎంత తెలుగుదేశం పార్టీపై వారసత్వ హక్కులు ఉన్న వ్యక్తి అయినా ఈ తరహా అహాన్ని ప్రదర్శిస్తే… దాన్ని స్వాగతించడానికి ఆయన కట్టుబానిసలు ఓకే చెప్పొచ్చు. కానీ ఉన్నది రాజరికంలో కాదు, చంద్రబాబు ఏమీ ఏపీకి నియంత కాదు, తామున్నది ప్రజాస్వామ్యంలో అని లోకేష్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 

Show comments