స్టార్ హీరోనే.. ఇండస్ట్రీలో అంత అభద్రతా భావమా..!

తన కూతురు హీరోయిన్ గా వద్దని సైఫ్ అలీఖాన్ ఇటీవల వ్యాఖ్యానించిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఒకవైపు సైఫ్ కూతురి గురించి బాలీవుడ్ అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తుంటే సైఫ్ మాత్రం తన కూతురు హీరోయిన్ కెరీర్ ను చూసుకోకపోతే తను ఆనందిస్తానని సైఫ్ అంటున్నాడు. మరి సైఫ్ అభిప్రాయానికి కారణం మరింత ఆసక్తికరం.

ఇండస్ట్రీలో అమ్మాయిలపై వేధింపులు ఉంటాయనో, తన కూతురు గ్లామరస్ పాత్రల్లో నటించడం ఇష్టం లేదనో సైఫ్ అలీఖాన్ ఆమెను హీరోయిన్ గా వద్దనడం లేదు. 

అయినా ఇద్దరు హీరోయిన్లను వివాహం చేసుకున్న సైఫ్ కు కూతురు హీరోయిన్ కావడం పట్ల పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. రీజన్ గ్లామర్ కాదు.. మరో విషయాన్ని ప్రస్తావిస్తూ తన కూతురు హీరోయిన్ కాకపోతే మేలని సైఫ్ అంటున్నాడు.

అదేమనగా.. సినీ పరిశ్రమలో కెరీర్ ఎన్నో ఒడిదుడుకులతో కూడుకున్నది అని సైఫ్ అంటున్నాడు. ఇక్కడ సేఫ్ జోన్ అంటూ ఏమీ ఉండదని, ఎప్పటికప్పుడు పరీక్షలే అని ఈ స్టార్ హీరో అంటున్నాడు.

పూర్తి స్థాయిలో కష్టపడినా ఫలితాలు దక్కుతాయని చెప్పడానికి లేదని, మన విజయం మన చేతిలో ఉండదు.. ఇంత అభద్రతాభావం ఉండే కెరీర్ ను తన కూతురు తీసుకుంటానంటే తనకు ఎలా ఆనందం కలుగుతుందని సైఫ్ ప్రశ్నించాడు.

మరి ఇండస్ట్రీ అంటే బయటి వాళ్లకు రంగురంగుల ప్రపంచంగా కనిపిస్తుంది. ప్రత్యేకించి సినీ వారసులు అంటే వారి లక్ మిగతా వాళ్లలో ఈర్షను కలిగించగలదు.

అయితే సైఫ్ మాత్రం సినీ పరిశ్రమ అంటే అందులో అభద్రతాభావం, అనునిత్యం ఇబ్బందులే అంటూ కొత్త నిర్వచనాన్ని ఇవ్వడమే గాక తన కూతురు అసలు సినిమాల వైపుకు రాకపోవడమే మేలని అంటున్నాడు.

Show comments