అంబానీ అయినా.. అమ్మ ముందు అంతే!

ప్రధానమంత్రి తోనైనా భుజాల మీద చేతులేసి మాట్లాడగలరు, పక్కనే కూర్చుని కాలు మీద కాలేసుకోగలరు!

ఇక ప్రైవేట్ పార్టీస్ లో అయితే.. ఎవ్వరి విషయంలో వారు ఎలాంటి ప్రోటోకాల్స్ పాటించనక్కర్లేదు. అయితే అమ్మ దగ్గర మాత్రం అంబానీలు అయినా.. అంతే! ఆశీర్వాదం కోసం అలా వినయపూర్వకం అయిపోతారు. 

అమ్మ మీద ప్రేమనే కాదు.. అంతకు మించిన వినయ విధేయతలనూ కనబరుస్తారు అంబానీ సోదరులు. మదర్ ను గాడ్ మదర్ గా భావించినట్టుగా అనిల్ అంబానీ సాష్టాంగ పడుతున్న దృశ్యం తాజాగా మీడియా కంట పడింది. 

ధీరూభాయ్ మరణానంతరం అంబానీల వ్యాపార సామ్రాజ్యంలో కోకిలా బెన్ కూడా క్రియాశీల పాత్ర పోషిస్తున్న విషయం విదితమే. సోదరులిద్దరి మధ్యనా కలహాలు వచ్చినప్పుడు, వారి మధ్య పంచాయతీలో అమె తగవు తీర్చడానికి కూర్చున్నారు. Readmore!

ప్రస్తుతం అంబానీ సోదరుల మధ్య కూడా కొంచెం ఐక్యత కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ‘గాడ్ మదర్’ దృశ్యం ఆసక్తికరంగా ఉంది. 

Show comments

Related Stories :