10న మహేష్ సినిమా టైటిల్

మహేష్-మురగదాస్ సినిమా మీద కన్నా, ఆ సినిమా టైటిల్ మీద ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఎవరికి తోచిన టైటిల్ వారు ఊహించేస్తున్నారు. ఎప్పుడో రిజెక్ట్ చేసిన అభిమన్యు టైటిల్ అంటూ తాజా గ్యాసిప్ పుట్టించారు. దీంతో మహేష్ కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నట్లు సమాచారం. ఆఖరికి ఆయన మూడు టైటిళ్లు సెమీ ఫైనల్ లిస్ట్ లోకి తీసుకువచ్చి, దర్శకుడు మురుగదాస్ కు ఫైనల్ బాధ్యత అప్పగించేసినట్లు వినికిడి.

లీకులు వద్దు. నేరుగా 10న సాయంత్రం 7 గంటలకు వీటిల్లో మీకు నచ్చిన టైటిల్ ను ట్వీట్ చేసేయండి అని దర్శకుడు మురుగదాస్ కు మహేష్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది. వీటిల్లో 'సంభవామి' టైటిల్ అగ్రస్థానంలో వుంది. 'కర్త' అన్న టైటిల్ కూడా ఆలోచించారు కానీ మళ్లీ వీటో చేసారు. 'సంభవామి' టైటిల్ విషయంలో తొలుత కాస్త ముందు వెనుకలాడిన మహేష్ బాబు 'గ్రేట్ఆంధ్ర' పోల్ లో ఎక్కువ మంది ఆ టైటిల్ లైక్ చేయడం గమనించి, మనసు కాస్త మార్చుకున్నట్లు తెలుస్తోంది.

మొత్తం మీద మహేష్ సినిమా టైటిల్ ఏమిటన్నది శుక్రవారం సాయంత్రం విడుదలవుతుంది.

Show comments