ప్రగ్యా జైశ్వాల్ - టాలీవుడ్ చకోర పక్షి

వర్షం ఎప్పుడు కురుస్తుందా అని చకోర పక్షి ఆత్రంగా ఎదురుచూస్తుందట. టాలీవుడ్ లో ప్రగ్యా జైశ్వాల్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. హిట్ ఎప్పుడొస్తుందా అని ఆశగా వెయిట్ చేస్తోంది. ఏ ముహూర్తాన ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో కానీ ఇప్పటివరకు సరైన కమర్షియల్ హిట్ అందుకోలేకపోయింది ప్రగ్యా. చివరికి నక్షత్రం కూడా ఆమెను ఆదుకోలేకపోయింది.

మిర్చిలాంటి కుర్రాడు, కంచె, ఓం నమో వేంకటాశాయ, గుంటూరోడు.. ఇలా ఎన్ని సినిమాలు చేసినా ప్రగ్యాకు కలిసిరావడం లేదు. కోరుకుంటున్న హిట్ తగలడం లేదు. కంచె సినిమాను క్రిటిక్స్ మెచ్చుకున్నారు తప్పితే కమర్షియల్ హిట్ కాదు. ఇక మిగతా సినిమాలన్నీ అట్టర్ ఫ్లాపులే. 

నక్షత్రం మాత్రం తన కోరిక తీరుస్తుందని గట్టిగా నమ్మింది ప్రగ్యా. ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. ఫస్ట్ టైం ఈ సినిమా కోసం ఫైట్స్ చేసింది. అంతేకాదు ఎక్స్ పోజింగ్ కు కూడా సై అంది. చాలా చోట్ల బికినీలో కనిపించి మెరిపించింది. ఇన్ని చేసినా నక్షత్రం మెరవలేదు. ప్రగ్యాకు కలిసిరాలేదు.

ప్రస్తుతం తన ఆశలన్నీ జయజానకి నాయక సినిమాపైనే పెట్టుకుంది. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మూవీ హిట్ అయితే ప్రగ్యాకు పేరొస్తుందని కచ్చితంగా చెప్పలేం.

Show comments