హీరో కూతురు.. రొమాంటిక్ జర్నీ!

సోనాక్షి సిన్హా.. ఇప్పటికే అర్జున్ కపూర్ ను దేవదాస్ గా మార్చేసిందనే అభియోగాన్ని ఎదుర్కొంటోంది. గతంలో జంటగా విహరించి, డేటింగ్ గట్రా చేసిన వీళ్లిద్దరికీ బ్రేకప్ అయ్యింది. దీంతో విరహ వేధనను అనుభవిస్తున్నాడట అర్జున్. ఆ వేధనతోనే అతడు పెళ్లైన మలైకాకు దగ్గరయ్యాడని… ఆ బంధం వివాదంగా మారుతోందని బాలీవుడ్ పత్రికలు చెబుతున్నాయి.

మరి ఏంటి.. అర్జున్ కపూర్ పరిస్థితి అని సోనాక్షి వద్ద ఆరాతీస్తే.. “నేనేం అతడిని ఒంటరిని చేయలేదు..’’ అని సోనాక్షి చెబుతోంది. ఆ విరహ వేధన  కథ అలా ఉంటే.. మరోవైపు సోనాక్షి సిన్హా  పేరు మరోప్రేమకథలోనూ వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ధ్రువీకరించడం లేదు కానీ… బంటీ సజ్దేకి మధ్య సమ్ థింగ్ , సమ్ థింగ్ అనేది గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న మాట.

పలు పార్టీల్లో వీళ్లిద్దరూ కలిసి దర్శనం ఇచ్చారని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అలాగే సోనాక్షి, బంటీ ల సెల్ఫీలు కూడా నెట్  ద్వారా ప్రచారంలోకి వచ్చాయి. వీళ్లిద్దరి మధ్య బ్రేకప్ అయ్యిందని కూడా కొన్ని వార్తలొచ్చాయి. అయితే తాజాగా వీళ్లిద్దరూ మరోసారి డిన్నర్ డేట్ లో దర్శనమిచ్చే సరికి.. బ్రేకప్ అబద్ధం, సాన్నిహిత్యం నిజం.. అనే విషయంపై స్పష్టత వస్తోంది.

తనకూ, బంటీకి మధ్య ప్రేమబంధం ఏమీ లేదని సోనాక్షి అంటున్నప్పటికీ… బాలీవుడ్ మీడియా మాత్రం దీన్ని రొమాంటిక్ జర్నీగానే అభివర్ణిస్తోంది. మరి బిహారీ బాబు తనయ రొమాంటిక్ జర్నీ ఆసక్తికరంగానే ఉంది! 

Show comments