మెగాస్టార్ 150 వ సినిమాలో ఆయన పక్కన హీరోయిన్ గా ఒకప్పటి టాప్ హీరోయిన్ విజయశాంతి అని టాక్ బయటకు వచ్చింది. అది నిజమవుతుందా? కాదా అన్నది పక్కన పెడితే, అసలు నిజం కావడానికి ఆస్కారం ఎక్కడుంది? అన్న అనుమానాలే ఎక్కువ కలుగుతున్నాయి.
తెలుగు హీరోలు ఎవరైనా కూడా తమ సినిమాల్లో హీరోయిన్ ఎంపిక అంటే సవాలక్ష వ్యవహారాలు చూస్తారు. కలర్, హైట్, వెయిట్, పెయిర్ మ్యాచ్, ఇంతకు ముందు వేసామా లేదా? ఇలా చాలా వ్యవహారాలున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ వల్ల సినిమాకు మరింత ఏడెడ్ అడ్వాంటేజ్ కావాలని చూస్తారు. మెగాస్టార్ తన సినిమా కోసం నయనతార, అనుష్క, ఆఖరికి జాక్విలిన్ ఫెర్నాండెజ్ వరకు ఎందుకు వెళ్లారు. విజయశాంతి ఇక్కడ వుందని తెలియకనేనా?
ఇక విజయశాంతి వైపు నుంచి చూస్తే, స్క్రీన్ కు దూరమై చాలా కాలం అయింది. ఎంత మంచి నటి కావచ్చు.. కానీ ఫిజిక్ ఫిట్ నెస్, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చూసుకోవాలి కదా? కష్టపడి మెగాస్టార్ మేకోవర్ అయ్యారు. అలా విజయశాంతి కూడా కావాలి కదా? లేకుంటే ఎలా సరైన జోడీ అనుకుంటారు. కావాలంటే మెగాస్టార్ 150 సినిమాలో స్పెషల్ రోల్ ఏమన్నా వుంటే విజయశాంతి ఓకె కానీ హీరోయిన్ గా ఎలా?
పైగా మెగాస్టార్ ఈ వయసులో కూడా తన డ్యాన్స్ స్కిల్స్ జనాలకు చూపించాలని అనుకుంటున్నారు. విజయశాంతి ఆ పని చేయగలరా అంటే అనుమానమే. సో ఏ విధంగా చూసినా, విజయశాంతి మెగాస్టార్ 150 వ సినిమాలో హీరోయిన్ అంటే అనుమానమే. నిజంగా అదే నిజమైతే, పాపం, మెగాస్టార్ కు మరెవరు హీరోయిన్ గా దొరకనట్లే అనుకోవాలి.