ఎన్టీఆర్-కొరటాల మరి కాస్త వెనక్కి

జనతా గ్యారేజ్ లాంటి హిట్ కాంబినేషన్ లో మరో సినిమా అంటే మాటలు కాదు. దానికి వచ్చే బజ్ నే వేరు. అలాంటి సినిమా లైన్ లో పెట్టాడు ఎన్టీఆర్. కానీ ఇప్పుడు ఆ లైన్ ఆఫ్ ఆర్డర్ అంతా మారిపోయింది. ప్రస్తుతం జై లవకుశ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్.

దాని తరువాత డిసెంబర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా స్టార్ట్ చేసి, సమ్మర్ వేళకు రెడీ చేయాలని అనుకున్నాడు. ఇదిలా వుంటే మహేష్ తో సంక్రాంతి నాటికి సినిమా ఫినిష్ చేసి, స్క్రిప్ట్ తయారుచేసుకుని, సమ్మర్ కు ఎన్టీఆర్ దగ్గరకు వద్దాం అనుకున్నాడు కొరటాల శివ.

కానీ ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ ఆర్డర్ అంతా మారిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్ సినిమా సంక్రాంతికి షెడ్యూలు అవుతోంది. దాంతో త్రివిక్రమ్ మార్చి వేళకు కానీ ఎన్టీఆర్ దగ్గరకు రాకపోవచ్చు. అప్పుడు ఆ సినిమా డిసెంబర్ కు కానీ పూర్తి కాదు.

మరి అప్పటి వరకు కొరటాల శివ ఏం చేయాలి? అందుకే ఈ లోగా రామ్ చరణ్ సినిమా ఫినిష్ చేసి వస్తానని ఎన్టీఆర్ కు చెప్పేసినట్లు తెలుస్తోంది. అంటే 2018లో కొరటాల శివ-ఎన్టీఆర్ సినిమా వుండదు. 2019లో ఎవరు? ఏమిటి? అన్నది అప్పటి సంగతి.

Show comments