హాట్‌ అండ్‌ స్పైసీ: చంపేస్తుందంతే

బుల్లి తెర నుంచి వెండితెరపైకొచ్చిన బ్యూటీ సోనారికా. తెలుగులో 'జాదూగాడు', 'స్పీడున్నోడు', 'ఈడోరకం ఆడోరకం' సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ, తాజాగా బాలీవుడ్‌లో నటించి 'సాసేన్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో సోనారికా ఓ రేంజ్‌లో భయపెట్టేస్తుందట. భయపెట్టడమే కాదు, తన గ్లామర్‌తో కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టేస్తుందట కూడా. 

సినిమాలో తన పాత్ర కొత్తగా వుంటుందనీ, తనకు పరిచయమైనవారంతా చనిపోతుంటారనీ, అదెందుకో తెరపై చూస్తేనే బావుంటుందని సోనారికా చెబుతోంది. థ్రిల్లర్‌ జోనర్‌లో సినిమా చేయనుండడం చాలా ఉత్కంఠగా వుందట. సినిమాలో నటిస్తున్నప్పుడు ఏమీ అనిపించలేదుగానీ, సినిమాని తెరపై చూసుకుంటే మాత్రం తనకు చాలా భయమేసిందని అంటోంది సోనారిక. 

థ్రిల్లర్‌ జోనర్‌ సినిమాల్లో ఇంత థ్రిల్‌ వుంటుందని తానెప్పుడూ అనుకోలేదంటున్న సోనారికా, ఇకపై ఇలాంటి సినిమాల్లో రెగ్యులర్‌గా నటిస్తానని చెబుతోంది. తెలుగులో మంచు విష్ణు సరసన 'సరదా' సినిమాలోనూ, తమిళంలో గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'ఇంద్రజిత్‌'లోనూ నటిస్తోందీ బ్యూటీ. హిందీ సిరియల్స్‌లో దేవతా పాత్రల్లో నటించిన సోనారికా, ఆ మధ్య బికినీ ఫొటోలతో హల్‌చల్‌ చేయడం అప్పట్లో వివాదాస్పదమైన విషయం విదితమే.

Show comments