'కాటమరాయుడు'తో పండగే పంండగ!

పవన్‌కళ్యాణ్‌తో నటించే ఛాన్స్‌ వచ్చినందుకు పండగే పండగ.. అంటున్నారు కొందరు నటీనటులు. 'నేను పవన్‌కళ్యాణ్‌కి తమ్ముడ్ని.. నేను పవన్‌కళ్యాణ్‌కి మరదల్ని..' అని వారంతా చెబుతోంటే, 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమా సమయంలో సంజన చేసిన హడావిడి అందరికీ గుర్తుకొచ్చింది. ఆ సినిమాలో సంజన నటించింది. 'పవన్‌తో నటించే ఛాన్స్‌ రావడం నా అదృష్టం. ఈ సినిమాతో నా దశ తిరిగినట్లే..' అని చెప్పిందామె అప్పట్లో. 

కానీ, 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమాలో సంజన పాత్రకి 'వెయిట్‌' ఏమాత్రం లేదు. ఆ సినిమాలో ఆమె వుందీ, అంటే వుందీ.. అంతే. అతకు మించి, ఆమెకు పెద్దగా సీన్‌ ఇవ్వలేదు. ఇచ్చారేమో, సినిమాలో మాత్రం కన్పించలేదు. ఎడిటింగ్‌లో దాదాపుగా ఆమె 'సీన్స్‌' ఔట్‌ అయిపోయి వుండొచ్చుగాక.! 

ఇక, ఇప్పుడు 'కాటమరాయుడు' విషయంలోనూ ఇదే ఎందుకు జరగకూడదు.? అన్న అనుమానాలైతే తెరపైకి వస్తున్నాయి. బాలారిష్టాలుదాటి సినిమా ఎలాగైతేనేం పట్టాలెక్కింది. దాంతో, ఈ సినిమాలో ఛాన్స్‌ దక్కించుకున్నోళ్ళంతా, సోషల్‌ మీడియా ద్వారానో, లేదంటే మీడియాకి సమాచారం అందించడం ద్వారానో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. 'ఆనంద్‌' ఫేం కమల్‌ కామరాజ్‌, హిమవర్ష తదితర నటీనటులు పంచుకుంటున్న ఆనందం, సినిమా విడుదలయ్యాక కూడా వుంటుందా.? వేచి చూడాల్సిందే.

Show comments