రెజినాకి ప్రమోషన్‌ వచ్చినట్లే.!

హీరోయిన్‌ రెజినాకి ప్రమోషన్‌ వచ్చింది. బాలీవుడ్‌లో ఛాన్స్‌ రావడమంటేనే ప్రమోషన్‌. అదొక్కటే కాదు, టాలీవుడ్‌లో పెద్ద హీరోయిన్‌గా రెజినాకి ఓ బంపర్‌ ఛాన్స్‌ దక్కిందని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఓ ప్రముఖ హీరో నటించే సినిమాలో రెజినాకి హీరోయిన్‌గా ఛాన్సొచ్చిందట. అది కూడా ఓ ప్రతిష్టాత్మక చిత్రమట. ఏమో, ఈ గాసిప్‌లో నిజమెంతోగానీ, ఇంకా అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి ప్రకటనా రాలేదు. 'ఓ పెద్ద సినిమాలో చేస్తున్న మాట నిజమే..' అని మాత్రమే రెజినా కాస్త క్లారిటీ ఇచ్చింది ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో. 

ఇక, రెజినా ఖాతాలో చాలా సినిమాలే వున్నాయిప్పుడు. ఎప్పుడో విడుదలవ్వాల్సిన 'శంకర' ఇప్పుడు తీరిగ్గా విడుదలకు సిద్ధమయ్యింది. ఇందులో నారా రోహిత్‌ హీరో. అన్నట్టు, నారా రోహిత్‌తోపాటు నాగశౌర్య నటిస్తోన్న 'జ్యో అచ్యుతానంద' సినిమాలోనూ రెజినా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్‌ కూడా ఊపందుకుంది. తమిళంలోనూ రెండు సినిమాలున్నాయి రెజినాకి. ఇందులో ఒకటి, మన టాలీవుడ్‌ హీరో సందీప్‌ కిషన్‌ నటించింది కావడం విశేషం. అదే 'మానగరం' సినిమా. తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది. 

బాలీవుడ్‌లో రెజినా నటించనున్న తొలి చిత్రం 'ఆంఖేన్‌'కి అమితాబ్‌, అనిల్‌కపూర్‌ లాంటి ప్రముఖ నటులతో హైప్‌ ఇప్పటికే క్రియేట్‌ అయిపోయింది. బాలీవుడ్‌లో ఛాన్సులొస్తున్నా, తెలుగులోనూ, తమిళంలోనూ సినిమాలు వదులుకోనంటోంది రెజినా. అంతా బాగానే వుందిగానీ, టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రెజినాకి ప్రమోషన్‌ ఇవ్వబోయే ఆ సినిమా ఏంటట.?

Show comments