నేషనల్ కాదు..ఇంటర్నేషనలే?

ఆంధ్ర 13 జిల్లాల ముక్కగా మిగిలింది. జనం నష్టపోయారో? రాష్ట్రం నష్టం పోయిందో? తెలియదు కానీ, పార్టీలు మాత్రం లాభపడినట్లే కనిపిస్తున్నాయి. అధికారం సాధించి తెలుగుదేశం పార్టీ తనకు అడ్డులేదన్నంత రేంజ్ లో తన చిత్తానికి రాష్ట్రాన్ని ఏలుతోంది. కాంగ్రెస్ పార్టీ తప్పిదం కారణంగా పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే వుంది. ఓ పక్క తన జనాల్ని తేదేపా కారణంగా కోల్పోతున్నా, మరోపక్క కాంగ్రెస్ ను మెల మెల్లగా ఖాళీ చేస్తూంది. అయితే మరీ ఒక్కసారిగా కాకుండా ఒక్కొక్కరిని పార్టీలోకి స్మూత్ గా తెచ్చుకుంటోంది. ఎంత స్మూత్ గా అంటే, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా వైకాపాలోకి రావడం ఖాయం అన్న వార్తలు వినవస్తున్నాయి. 

సో, రాష్ట్రం సంగతి ఎలా వున్నా పార్టీలు హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే ఇప్పుడు అవి రీజనల్ పార్టీలు కావు. జాతీయ పార్టీలు..కాదు కాదు..అంతర్జాతీయ పార్టీలుగా మారిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో వుండాలి కాబట్టి జాతీయ పార్టీలు అనుకోవచ్చు. అక్కడితో ఆగడం లేదు. విదేశాల్లో కూడా హడావుడి చేస్తున్నాయి. అక్కడ పోటీ లేదు, అధికారం లేదు. అసలు ఆ అవకాశమే లేదు. కానీ విదేశాల్లో తేదేపా, వైకాపా రెండు పార్టీల హడావుడి ఇంతా అంతా కాదు.

అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీనయితే ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ పార్టీనే.  ఎందుకంటే ఎప్పటి నుంచి ఆ పార్టీకి ఆస్ట్రేలియా, సింగపూర్, అమెరికా. చాలా దేశాల్లో  టీడీపీకి కార్యవర్గాలున్నాయి, లీడర్లున్నారు, ఆయా దేశాల, నగరాల కమిటీలు కూడా ఉన్నయి. ఆఖరికి విదేశాల్లో జన్మభూమి కమిటీలు కూడా. ఎన్టీఆర్ జయంతి దగ్గరి నుంచి పార్టీ నిర్వహించే మహానాడు వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూనే ఉన్నరు. 

ఇక వైకాపా కూడా ఏమీ తీసిపోలేదు. నిన్నటికి నిన్ననే ఆ పార్టీ  నాయకుడు అంబటి రాంబాబు కాలిఫోర్నియాలో వైకాపా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేసారు. అంతకు ముందు వైకాపా కమిటీలు విదేశాల్లో కూడా వున్నాయి. అక్కడా ర్యాలీలు, మీటింగ్ లు చేస్తూనే వున్నాయి. ఇక ఆయా పార్టీల నాయకులు చంద్రబాబు, జగన్ లు ఆంధ్రలో  ఎంత తిరుగుతారో, విదేశాల్లో కూడా అలాగే తిరుగుతూ వుంటారు. ఈ విషయంలో జగన్ కాస్త తక్కువ కానీ, తెలుగుదేశం నాయకులు బాబు, లోకేష్, బాలయ్య తరచు విదేశాలకు వెళ్తూనే వుంటారు. Readmore!

అందువల్ల రెండు పార్టీలు కూడా విదేశాల్లో బాగానే కాలూనుకుంటున్నాయి. కానీ రెండూ కూడా విదేశాల్లో మన జనాల మనసులు గెల్చుకుంటున్నాయి కానీ, అంతకన్నా ఎక్కువగా ఇంట జనాల మనసులు కూడా ఇంకా గెలుచుకోవాల్సి వుంది మరి. అదెఫ్పుడో?

Show comments

Related Stories :