హోదా రాలేదు: బాబు మరింత గొప్పోరయ్యారు!

ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు.. దీని పర్యవసనాలు ఏమిటి? విభజనతో నష్టపోయిన రాష్ట్రం గతి ఏమవుతుంది? అనే టెన్షన్ సంగతేమో కానీ.. ఈ అదనులో చంద్రబాబు గొప్పదనం మరింత పెరిగిందని ప్రచారం మొదలుపెట్టింది పచ్చబ్యాచ్! రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడాన్ని బట్టి చంద్రబాబు గొప్పదనం ఏమిటో అర్థం చేసుకోవాలని వారు చెబుతున్నారు. ఇదేదో వ్యంగ్యంగా చెబుతున్న మాట కాదు.. తెలుగుదేశం అనుకూలురు, ఆ పార్టీ ఎంపీలు చాలా గర్వంగా చెబుతున్నమాట! ప్రత్యేక హోదా రాకపోవడం అనేది బాబు గొప్పదనానికి నిదర్శనం!

అదేంటి? అదెలా? అంటారా.. మోడీ గారికి బాబు మీద కుళ్లు అట, ఈ దేశంలో ప్రస్తుతం ప్రధానమంత్రి  పదవిని పొందడానికి తగిన స్థాయిలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడట! ఈయనంటే మోడీకి కుళ్లు అంట. ఈయన  ఆద్వర్యంలోని రాష్ట్రానికి మోడీగారు సహకరించకపోవడానికి ఇదే కారణమట. 

ఈయన ఎక్కడ తన పదవికి పోటీకి వస్తారో అని మోడీ భయపడిపోతున్నాడట. అందుకే ఏపీకి ఏ మాత్రం సహకరించకూడదని మోడీ ఫిక్సయిపోయారట. ఇదీ పచ్చపార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం ఎంపీదివాకర్ రెడ్డి వంటి వాళ్లు చెబుతున్నమాట!

దేనికైనా హద్దు ఉంటుంది కానీ.. ఈ బ్యాచ్ అరాజకపు మాటలకు మాత్రం హద్దు ఉండదని అంతా అర్థం చేసుకోవాలి. పదమూడు జిల్లాల పరిధికి మిగిలిన ఒక రాష్ట్రంలో పదిహేను ఎంపీ సీట్ల ను మాత్రమే గెలిచిన వ్యక్తిని చూసి.. ఆల్రెడీ ప్రధాని పీఠంలో ఉన్న వ్యక్తి..మొన్నటి ఎన్నికల్లో సంచలన విజయం సాధించి, ప్రధాని పఠాన్ని ఎక్కిన వ్యక్తి, అందునా బాబుగారి ‘సన్నిహితుడు’ కుళ్లి పోతున్నాడని, ఎక్కడ బాబుగారి ఆధ్వర్యంలో ఏపీ దూసుకుపోతుందో.. ఎక్కడ బాబు ప్రధానమంత్రి పదవికి పోటీకి వచ్చి తన పీఠానికి ఎసరుతెస్తాడో అని.. ప్రత్యేక హోదా రావడం ఇవ్వడంలేదని ఇదంతా బాబు గారి గొప్పదనానికి నిదర్శనం అని చెప్పుకుంటున్న తీరును చూస్తుంటే మాత్రం.. ఏపీ జనాలు తెలుగుదేశం అనుకూలుర దృష్టిలో ఎంత వెర్రివాళ్లో అర్థం చేసుకోవచ్చు! ఇలా చెప్పుకొంటున్న వీళ్లు ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడం పట్ల వీళ్లు చాలా ఆనందంగా ఉన్నారు కాబోలు. 

Show comments