పార్టీ నేతలకు తలా పది లక్షలతో హీరోగారి ఓదార్పు?

తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త గాసిప్ షికారు చేస్తోంది. గత ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయిన విజయ్ కాంత్ పార్టీకి సంబంధించిన వార్త ఇది. తన పార్టీ తరపున పోటీ చేసి ఆర్థికంగా నష్టపోయిన వాళ్లకు విజయ్ కాంత్ ఓదార్పును ఇస్తున్నాడని సమాచారం. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన వాళ్లకు ఆర్థికంగా అండగా ఉంటానని విజయ్ కాంత్ ప్రకటించాడట. భారీ బడ్జెట్ సినిమాను కొని.. అది ప్లాఫ్ కావడంతో.. నష్టపోయిన బయ్యర్లకు నష్టపరిహారాలు చెల్లించిన లెక్కన రాజకీయాల్లో తన తరపున నిలబడి ఆర్థికంగా దెబ్బ తిన్న వారికి కెప్టెన్ ఊరటనివ్వనున్నాడని సమాచారం!

గత ఎన్నికలతో ఆర్థికంగా చితికిపోయిన పార్టీ అభ్యర్థులకు ఇప్పుడు తలా ఒక పదిలక్షల రూపాయలు ఇవ్వాలని  భావిస్తున్నాడట కెప్టెన్! దీనికి డీఎండీకే శ్రేణులు మరో రీజన్ కూడా చెబుతున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ చాలా మందికి చేరలేదని.. దీంతో అభ్యర్థులు సొంత ఖర్చులు పెట్టుకున్నారని.. వారంతా నష్టాలు చవి చూశారని ఈపరిస్థితిని అర్థం చేసుకుని కెప్టెన్ సొమ్ములు ముట్టజెప్పే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడని వీరు చెబుతున్నారు.

మరి రాజకీయంగా అచేతన స్థితిలో ఉన్న విజయ్ కాంత్ గనుక ఈ నష్టపరిహాం ఇచ్చే ప్రోగ్రామ్ ను పెట్టుకొన్నట్టు అయితే కొత్తరకం రాజకీయాలకు తెరతీసినట్టు అవుతోంది. 

Show comments