'తిక్క' విడుదల వుంటుందా?

సాయిధరమ్ తేజ తిక్క సినిమా విడుదల అన్నది ఓ చిత్రమైన విషయంగా తయారైంది. ఇప్పటి దాకా సెన్సారుకు దరఖాస్తు చేయలేదని వినికిడి. ట్రయిలర్ విడుదల చేసారు. అది చూసి బయ్యర్లు నాలుగు అడుగులు వెనక్కు వేస్తున్నారని టాక్. ఓవర్ సీస్ లో ఫ్రీగా ఇచ్చేసారు. దానికి సినిమా ట్రయిలర్ మాత్రమే కాదు, బాబు బంగారం సినిమా మీద తిక్క సినిమాను వేస్తామని అనడమే. 

ఎంత కాదన్నా వెంకీ-నయన్ కాంబినేషన్ అంటే చిన్నదో, పెద్దదో బజ్ వుంటుంది. మరి ఆ సినిమా మీదకు రావాలని తిక్కకు ఎందుకు పంతమో తెలియడం లేదు. మళ్లీ మాట్లాడితే 13న కాదు 11నే విడుదల చేద్దాం అనేంత పట్టుదలతో వుందట తిక్క సినిమా యూనిట్. ఏమిటో ఆ కాన్ఫిడెన్స్ అని సినిమా జనాల సందేహం.  

ఒక వేళ తిక్క రాదు అంటే తమ సినిమాను తీసుకురావాలని రెండు సినిమాలు వెయిట్ చేస్తున్నాయి. ఒకటేమో వీరభ్రదమ్ చౌదరి-ఆది కాంబినేషన్ లోని చుట్టాలబ్బాయి. మరొకటి సుశాంత్-నాగేశ్వర రెడ్డి కాంబినేషన్ లోని ఆటాడుకుందాం రా. ఈ రెండు సినిమాలు అలా వెయిట్ చేస్తున్నాయి. కానీ తిక్క కన్ ఫర్మ్ గా వస్తుందా రాదా అన్నది తెలియడం లేదు. బాబు బంగారం మాత్రం చకచకా విడుదల ఏర్పాట్లుచేసుకుంటోంది.

Show comments