ఇదెక్కడి చోద్యం..ఆంజనేయలా?

ఎవరన్నా ఇధి మాకు కావాలి అంటూ డిమాండ్ సాధనకు పాద యాత్ర చేస్తారు. కానీ కాపు కార్పొరేషన్ చైర్మన్ వైనం వేరుగా వుంది. వైఎస్ హయాంలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి, ఆపై విస్మరించారని, ఆ వైనం జనాలకు చెప్పడానికి తాను ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేస్తానని అంటున్నారు. అటు కాపు నాయకుడు ముద్రగడ ఏమో, కాపులకు రిజర్వేషన్ కల్పించాలని పాద యాత్ర చేస్తానని ప్రకటించడంతో రామాంజనేయులకు ఊపు వచ్చినట్లుంది. 

కానీ ఏం చెప్పి పాద యాత్ర చేయాలి. ముద్రగడ కు కౌంటర్ గా ఏదో ఒకటి చేయకుంటే పదవి ఇచ్చిన బాబు ఊరుకోరు. అందుకే ఈ విచిత్ర మార్గం ఎంచుకున్నట్లుంది? అయితే ఇక్కడ రామాంజనేయులు ఒక విషయం విస్మరిస్తున్నారు. జనం ముందుకు వెళ్లి, వైఎస్ చేయలేదు అని చెప్పగానే, మరి బాబు ఏం చేస్తున్నట్లు అని అడుగుతారు. అది పక్కా. అదే పనిలో వున్నారు అంటే జనం సంతృప్తి చెందరు. 

వాళ్లు చేయలేదు..వీళ్లు చేయడం లేదు అని నిట్టూరుస్తారు. సో, ఇలాంటి ప్రయత్నం వల్ల పార్టీకి ఒరిగేది ఏమీ వుండదు. కాపుల మనస్సు మారేదీ వుండదు. ఎటొచ్చీ పదవి కట్టబెట్టినందుకు, సదావర్తి భూముల పందేరం దొరికినందకు తన వంతృ ప్రయత్నం తాను చేసినట్లు బాబుకు కనిపించడం తప్ప.

Show comments