గెడ్డం గెటప్ లో నాగశౌర్య

క్లీన్ షేవ్ తో లవర్ బాయ్ లుక్ తో వుంటాడు నాగశౌర్య. అలాంటిది ఇప్పుడు అతగాడికి కాస్త గడ్డంతో డిఫరెంట్ గెటప్ తో చూపించే ప్రయత్నం చేయబోతున్నాడు దర్శకుడు సుకుమార్. సుకుమార్ బ్యానర్ లో నాగశౌర్య హీరోగా ఓ సినిమా ఓకె అయిన సంగతి తెలిసిందే. 

ఈ సినిమాలో నాగశౌర్యను కాస్త గడ్డంతో డిఫరెంట్ గెటప్ లో చూపించాలనుకుంటున్నాడట సుకుమార్. సుకుమార్ కథలు, సినిమాలే కాదు, హీరో పాత్రలను కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేసాడు. అందుకే ఈ సినిమాలో నాగశౌర్య కు కూడా డిఫరెంట్ లుక్స్ తో డిజైన్స్ తయారుచేయించాడట. 

ఆ మేరకు ముందు ఓ నెల గెడ్డం పెంచమని కోరాడట. మరి కథ ఏమిటో.. దాని వైనమేమిటో ముందు ముందు తెలుస్తుంది.

Show comments