ఇండస్ట్రీలో ‘అడ్జస్ట్ మెంట్’ తప్పదన్న సీనియర్ నటి!

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలోని పరిస్థితులపై బాగా చర్చలో ఉన్న వ్యవహారం కాస్టింగ్ కోచ్. చాలా మంది మాజీ హీరోయిన్లు చాలా ఓపెన్ గా ఈ అంశంపై స్పందించారు. ఇండస్ట్రీలో హీరోయిన్లపై అలాంటి వేధింపులు తప్పవు అని, వాటిని తాము ఎదుర్కొన్నామని వారు చెప్పారు. హీరోలు, నిర్మాతలు బెడ్రూమ్ కు రమ్మన్నారని.. వారు తేల్చి చెప్పారు. వారిలో తెలివి మీరిన వారు.. తాము లొంగలేదని చెప్పగా, కొందరు మాత్రం ఆ వేధింపులను తాళలేకపోయామని బాధపడ్డారు.

ఇలాంటి నేపథ్యంలో సీనియర్ నటీమణి రమ్య కృష్ణ ఈ అంశం పై స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఇంతకీ రమ్య ఏమందంటే.. కేవలం సినీ ఇండస్ట్రీ అనే కాదు, ఏ రంగంలో అయినా మహిళలు పని చేయాలంటే ‘అడ్జస్ట్ మెంట్’ తప్పకపోవచ్చు అని వ్యాఖ్యానించింది.

మరి ఇక్కడ ‘అడ్జస్ట్ మెంట్’ అనే మాటకు నిర్వచనం చాలా బోల్డ్ అనే చెప్పాలి. ‘బహుశా.. ఆడవాళ్లకు అన్ని రంగాల్లోనూ అడ్జస్ట్ మెంట్ తప్పదు.. వాటిల్లాగానే ఇక్కడ కూడా..’ అంటూ చాలా బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది రమ్య కృష్ణన్. ‘అడ్జస్ట్ కావాలా వద్దా అనే విషయంపై ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాలి.. “ అని తేల్చి చెప్పిన రమ్య.. “అడ్జస్ట్ అయ్యే వాళ్లే ముందుకు వెళతారు…’ అని తేల్చి చెప్పడం మరింత ఆసక్తికరంగా ఉంది.

 మరి ఇక్కడ ‘అడ్జస్ట్ మెంట్’ కు మీనింగ్ చాలా లోతైనదే. ఈ మధ్య కాలంలో హీరోయిన్ల మాటలనే ప్రాతిపదికగా తీసుకుని.. ‘అడ్జస్ట్ మెంట్’ మాటను ఉపయోగించడం జరిగింది.  రమ్య మొహమాటం ఏదీ లేకుండా.. అడ్జస్ట్ అయిన వాళ్లే ముందుకు వెళతారు.. అని తేల్చేసింది! అదీ కథ.

Show comments