భ్రమరాంబకు నచ్చేసిన చైతూ

దేవీ శ్రీ ప్రసాద్ పాట అంటేనే వేరు. ఎవరైనా కాలు కదపాల్సిందే. అదే అంటున్నాడు కింగ్ నాగార్జున కూడా. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా కోసం భ్రమరాంబకు నచ్చేసాను పాట కచ్చితంగా మీ చేత డ్యాన్స్ చేయిస్తుంది అంటూ ట్వీట్ చేసాడు. రారండోయ్ వేడుక చూద్దాం కోసం శ్రీమణి రాసిన పాట ఇది. ఫుల్ జోష్ తో,యూత్ ఫుల్ లాగ్వేంజ్ వాడిన ఈ పాటకు దేవీశ్రీ తన స్టయిల్ బీట్ ను జతచేసాడు.

అందుకే కావచ్చు నాగ్, చాలా స్పెషల్ గా ట్వీట్ చేసాడు. రారండోయ్ సినిమాకు భలే బజ్ వస్తోంది. సినిమా విడుదల ఇంకా పది రోజులు వుందనగానే టీజర్, ట్రయిలర్, సాంగ్ ప్రోమోలు అన్నీ కలిసి భలే బజ్ ను తీసుకువస్తున్నాయి. పిక్చరైజేషన్ అందంగా కలర్ ఫుల్ గా వుండడం ఒకటయితే, రకుల్ తన డ్రెస్ సెన్స్ తో కుర్రకారును గుండెలకు గాలం వేసి లాగేస్తోంది. దీంతో ఫ్యామిలీలు రెడీగా వెయిటింగిక్కడ అన్నట్లు చూస్తున్నాయి 26వ తేదీ కోసం. మొత్తం మీద కురసాల కళ్యాణ్ మరో హిట్ కొట్టేలాగే వున్నాడు. అదే జరిగితే నాగ్ తో బంగార్రాజు ఫిక్స్.

Show comments