ఈరోజు తేలిపోతుంది యవ్వారం

పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ తెలుగు సినిమా మీద భయంకరంగా పడింది. ముందు కలెక్షన్లు పడిపోయాయి. ఆపై సినిమాలకు డబ్బులు కట్టే మార్గం కనిపించడంలేదు. పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోందని, జనం థియేటర్లకు రావడం ప్రారంభమైందని వార్తలు అందుతున్నాయి.

అయితే బయ్యర్లు డబ్బులు కట్టే పరిస్థితిలో వున్నారా లేదా అన్నది తెలియడం లేదు. ఇప్పుడు ఈ విషయం పై పల్స్ అందే టైమ్ వచ్చింది. ఎందుకంటే ఈవారం నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా విడుదలవుతోంది.  ఆ సినిమాకు రేపే బయ్యర్లు డబ్బులు కట్టాల్సి వుంది.

మరి లక్షలకు లక్షలు కొత్త నోట్లు బయ్యర్లకు దొరికాయా లేదా అన్నది తేలాల్సి వుంది. అలా కట్టడం జరిగితే, టాలీవుడ్ బిజినెస్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చిందని భావించవచ్చు. లేదూ అలా కట్టకపోతే, మరి ఈ నెల 25న వుండాల్సిన సినిమాలు కూడా వెనక్కు పోయే ప్రమాదం వుంది.

Readmore!
Show comments