కౌంటర్ కు బోయపాటి ప్రిపేర్?

దర్శకుడు బోయపాటి సైలెంట్ గా వున్నారు. కానీ ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ ఓ మాట విసిరారు. సూపర్ హిట్ సింహా కథ, మాటలు తనవే అన్న అర్థం వచ్చేలా. ఇక బోయపాటి బంధువు పోసాని కృష్ణ మురళి కూడా ఏవేవో అన్నారని వార్తలు వచ్చాయి. మరి బోయపాటి ఏమీ మాట్లాడరేం? అనవసరంగా, మాటకు మాట వస్తుందని సైలెంట్ గా వుండిపోయారా? అన్నది అనుమానం. 

కానీ కాదట, సరైన వేదిక కోసం చూస్తున్నారు అని తెలుస్తోంది. త్వరలో అలాంటి అవకాశం ఒకటి రాబోతోంది..అప్పుడు ఆయన కూడా మాటల తూటాలు విసిరేందుకు రెడీ అవుతారని తెలుస్తోంది.  బాలయ్య-బోయపాటిల కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ లెజెండ్. ఈ సినిమా రాయలసీమలోని ఓ థియేటర్ లో వెయ్యి రోజుల ప్రదర్ళన పూర్తి చేసుకుంటోదట. ఈ సందర్భంగా ఓ మాంచి ఫంక్షన్ చేయాలన్న ఆలోచన ఆ ప్రాంత బాలయ్య అభిమానులకు వుందట. 

అదే తన వెర్షన్ వినిపించడానికి సరైన వేదిక అని బోయపాటి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వేదిక మీద తన వెర్షన్ ను వినిపించడమే కాకుండా, తనపై వచ్చిన విమర్శలు లేదా ఆరోపణలకు సమాధానం చెప్పడానికి బోయపాటి డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. చూడాలి. కౌంటర్ ఇచ్చి బోయపాటి హీట్ పెంచుతారో? తగ్గిస్తారో?

Readmore!
Show comments