హృతిక్‌.. ఎందుకిలా చేశావ్‌.!

ఓ స్టార్‌ హీరోతో చిన్నపాటి పరిచయం వున్నాసరే, అదేదో గొప్ప పరిచయం అని చెప్పుకోవడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించాలనుకోవడం పెద్ద విషయమే కాదు. కానీ, బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ని 'ఫ్రెండ్‌' అని వ్యాఖ్యానించడం 'రోగ్‌' బ్యూటీ ఏంజెలాకి పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. అయితే, నిజానికి ఆమె ఆ వ్యాఖ్యలు చేయలేదట. హృతిక్‌తో కలిసి రెండు టీవీ కమర్షియల్స్‌లో ఏంజెలా నటించింది. బహుశా ఆ విషయం హృతిక్‌కి గుర్తుండకపోవచ్చు. 

ఓ పత్రిక హెడ్‌లైన్స్‌లో ఏంజెలా, తన గురించి ఏదేదో మాట్లాడిందన్న వార్త చూసి హృతిక్‌ తొందరపడ్డాడు. 'ఎవరు నువ్వు.? ఎందుకు అబద్ధాలు చెబుతున్నావ్‌..' అంటూ హృతిక్‌ సోషల్‌ మీడియాలో, ఏంజెలాకి షాక్‌ ఇచ్చాడు. దాంతో, ఏంజెలా వివరణ ఇచ్చుకోక తప్పలేదు. హృతిక్‌తో రెండు టీవీ కమర్షియల్స్‌ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, హృతిక్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాననీ, ఆ కమర్షియల్స్‌ చిత్రీకరణలో అతని నుంచి చాలా నేర్చుకున్నానని మాత్రమే చెప్పానంటూ ఏంజెలా సోషల్‌ మీడియాలో పేర్కొంది. 

దాంతో, హృతిక్‌ కూడా తన తొందరపాటుకు చింతించినట్లున్నాడు. 'మిస్‌లీడింగ్‌ హెడ్‌లైన్స్‌..' అని పేర్కొంటూ, ఏంజెలా వివరణ పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ఏంజెలాకి విషెస్‌ కూడా అందించేశాడు హృతిక్‌. అలా ఏంజెలా పెద్ద వివాదం నుంచే బయటపడింది. అయినా, ఈ విషయంలో హృతిక్‌ ఎందుకంత తొందరపడ్డాడట.?

Readmore!
Show comments