పోర్న్‌స్టార్‌ కూడా నీతులు చెప్పేస్తే ఎలా.?

ప్రముఖ బాలీవుడ్‌ దర్శక నిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీపై దాడి జరిగింది. తమ మనోభావాల్ని కించపరుస్తూ, చరిత్రను వక్రీకరిస్తూ 'పద్మావతి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారంటూ కొందరు సంజయ్‌ లీలా భన్సాలీపై దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. 

ఈ వ్యవహారంపై ఒకప్పటి పోర్న్‌స్టార్‌, ప్రస్తుత బాలీవుడ్‌ హాట్‌ బాంబ్‌ సన్నీలియోన్‌ కూడా స్పందిచేసింది. 'సంజయ్‌ లీలా భన్సాలీపై దాడిని ఖండిస్తున్నాను..' అనడం వరకూ ఆమెను తప్పుపట్టడానికేమీ లేదు. కానీ, ఖండించడంతోపాటుగా 'రాజ్యాంగం ఏం చెబుతోందో వినండి, తెలుసుకోండి.. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రిపబ్లిక్‌ డే వేడుకల్ని ఒక్క రోజు కాదు, ప్రతిరోజూ జరుపుకోండి.. ఆ రాజ్యాంగం కల్పించిన ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ని గౌరవించడం ద్వారా..' అంటూ క్లాస్‌ తీసుకోవడమే ఇక్కడ అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. 

పోర్న్‌ సినిమాల్లో నటించడం భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు వ్యతిరేకం. మన చట్టాల పరంగా కూడా పోర్నోగ్రఫీపై నిషేధం వుంది. భారతీయ మూలాలున్న సన్నీలియోన్‌, ఎక్కడో కెనడాలో పుట్టింది గనుక.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్ని తుంగలో తొక్కేసి మరీ, పోర్న్‌ సినిమాల్లో నటించేసింది. బాలీవుడ్‌లో అవకాశాలు రాగానే, ఆమెకు భారతీయత గుర్తుకొచ్చేసింది. భారత రాజ్యాంగం గురించి కూడా మాట్లాడేస్తోంది. భారతదేశంలో చట్టాలనూ ఉదహరించేస్తోంది. పన్నీలియోన్‌తో నీతులు చెప్పించుకోవాల్సిన ఖర్మ పడ్తుందని ఎవరైనా ఊహించారా.?

Show comments