తమన్నాను అలా ముగ్గులోకి దింపాడట!

మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వాళ్లు తమ ప్రేమ విషయాన్ని బాహ్య ప్రపంచానికి వెల్లడించి కూడా చాలా రోజులైంది. అయితే ఇప్పటివరకు అసలు విషయాన్ని మాత్రం వాళ్లు ఇంతవరకు బయటకు చెప్పలేదు. అదేంటంటే.. వీళ్లిద్దరి ప్రేమకథ ఎలా మొదలైంది?

తమన్నా వెళ్లి విజయ్ వర్మకు 'ఐ లవ్ యు' అని చెప్పిందా లేక విజయ్ వర్మ, తమన్నాకు ప్రపోజ్ చేశాడా.. ఆ స్టార్టింగ్ పాయింట్ ఏంటనేది చాలామందిగి ఆసక్తి కలిగించే విషయం. ఎట్టకేలకు విజయ్ వర్మ ఆ మేటర్ ను బయటపెట్టాడు.

లస్ట్ స్టోరీస్-2 టైమ్ లో వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని చాలామంది భావించారు. కానీ అలాంటిదేం లేదని స్పష్టం చేశాడు విజయ్ వర్మ. ఆ సిరీస్ షూటింగ్ తర్వాత ఓ చిన్న పార్టీ జరిగిందంట. ఆ పార్టీలో మెల్లగా తమన్న దగ్గరకు వెళ్లాడట విజయ్ వర్మ. "మీతో మరింత ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాను." అని తమన్నాతో అన్నాడట.

అతడు ఆ మాట చెప్పిన తర్వాత దాదాపు 3 వారాల పాటు తమన్న నుంచి స్పందన రాలేదంట. దాదాపు 20-25 రోజుల తర్వాత తమ ఫస్ట్ డేట్ ప్రారంభమైనట్టు విజయ్ వర్మ గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని ప్రేమలో పడ్డారట.

చాలామంది నటీనటుల్లా సీక్రెట్ గా ప్రేమించుకోవడం తమ వల్ల కాలేదని స్పష్టం చేశాడు విజయ్ వర్మ. అందుకే తొందరగానే తమ లవ్ మేటర్ బయటకొచ్చేసిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తమన్నానే తనకు సర్వస్వం అని ప్రకటించిన ఈ నటుడు, పెళ్లిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నాడు.

Show comments

Related Stories :