సలార్.. ఐటమ్ సాంగ్ షిఫ్ట్ ?

సలార్ సినిమా యాక్షన్ ట్రయిలర్ వచ్చి ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. సినిమా మీద బజ్ ను అమాంతం పెంచింది. ఇప్పటికి ఓ పాట వదిలారు. సిట్యువేషన్ సాంగ్. మీనింగ్ ఫుల్ గా వుండడంతో జనం ఓకె చేసారు. ఇప్పుడు మరో పాట రాబోతోంది. అది కూడా ఇలాంటిది. మరింత అర్థవంతంగా వుంటుంది.

అయితే ఫ్యాన్స్ చూస్తున్నది వీటి కోసం కాదు. ఐటమ్ సాంగ్ కోసం. సలార్ సినిమా కోసం కొన్ని రోజుల క్రితం ఐటమ్ సాంగ్ చిత్రీకరించారని వార్తలు వచ్చాయి. అ తరువాత సలార్ రెండు భాగాలా? ఒక భాగమా అన్న మీమాంస నడుస్తోందని వార్తలు వినిపించాయి. అందుకే ఓ ఫైట్, ఐటమ్ సాంగ్ యాడ్ చేసారని కూడా వినిపించింది.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్ ను ఫస్ట్ పార్ట్ నుంచి తీసేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాటను రెండో భాగానికి షిఫ్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. 

కానీ ఐటమ్ సాంగ్ వుంటేనే తొలిసగం బాగుంటుందని, కేవలం ఫైట్లు మాత్రమే కాదు, ఐటమ్ సాంగ్ కూడా కీలకమే అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అందువల్ల తొలిసగంలో వుంచుతారా? మలిసగానికి మారుస్తారా? అన్నది తెలియాలంటే రెండు మూడు రోజులు ఆగాల్సిందే. Readmore!

Show comments

Related Stories :