కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా జాక్ పాట్ కొట్టేసింది. టీజర్ అనౌన్స్ మెంట్ తోనే థియేటర్ హక్కులు హోల్ సేల్ గా అమ్ముడైపోయాయి. టీజర్ వస్తున్నపుడే అందరూ అంచనా వేసారు. అదే జరిగింది. పెద్ద పెద్ద బయ్యర్లు ట్రయ్ చేసారు హక్కుల కోసం.
నిర్మాతకు సన్నిహితమైన మరో చిన్న నిర్మాత కమ్ బయ్యర్ ఈ హక్కులను తీసుకున్నారు. 12 కోట్లకు ఎపీ- తెలంగాణ- సీడెడ్ హక్కులను దక్కించుకున్నారు.
మామూలుగా అయితే కిరణ్ అబ్బవరం సినిమాలు రెండు రాష్ట్రాలు కలిపి మూడు నుంచి అయిదు కోట్లు పలుకుతాయి. కానీ ఈ జోనర్, టీజర్ క్వాలిటీ ఇవన్నీ చూసి ఇంత రేటు పలికింది. ఇక ఓవర్ సీస్, నాన్ థియేటర్ హక్కులు వున్నాయి. అవి కూడా అయిపోతే, మంచి డేట్ చూసి, విడుదల అనౌన్స్ చేస్తారు.
ఈ సినిమాకు ఇంకా అయిదారు రోజులు షూట్ బకాయి వుంది. ఆపై పోస్ట్ ప్రొడక్షన్. క్వాలిటీ విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. అందుకే అస్సలు తొందర పడకుండా ఆచి తూచి ముందుకు వెళ్తున్నారు.