నవీన్ పోలిశెట్టి మంచి పీక్ టైమ్ ను వదిలేసుకుంటున్నాడు. సక్సెస్ పక్కాగా వుండాలి అనే ఆలోచనతో ఏ స్క్రిప్ట్ ను కూడా అంత సులవుగా ఓకె చేయడం లేదు అని వార్తలు వచ్చేసాయి. ఆ వార్తలు కూడా వైరల్ అయ్యేసరికి నవీన్ నుంచి తెలుగు, ఇంగ్లీష్ ల్లో రెండు బహిరంగ లేఖలు వచ్చాయి. తనకు గాయాలు అయ్యాయని, కోలుకుంటున్ననని, త్వరలో మంచి అప్ డేట్ లు ఇస్తానని, ఆ లేఖల సారాశం.
అయితే ఈ ఏడాది మార్చిలోనే నవీన్ కు అమెరికాలో గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. మిస్ శెట్టి విడుదల తరువాత ప్రమోషన్ల కోసం నవీన్ అమెరికా వెళ్లారు. అంటే గత ఏడాది చివరిలో. అప్పటి నుంచి అక్కడే వున్నారు. ఆ టైమ్ లోనే ఇదిగో వస్తారు.. అదిగో వస్తారు అనే వార్తలు వినిపించాయి. అలాంటి టైమ్ లో ప్రమాదం జరిగింది, ఫ్రాక్చర్ అయిందన్న వార్తలు వచ్చాయి. కానీ గమ్మత్తేమటంటే టాలీవుడ్ జనాలు దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. అమెరికా నుంచి ఇప్పుడే రావడం ఇష్టం లేక నవీన్ ఏదో చెబుతున్నారని అనుకున్నారు.
కానీ ఇప్పుడు నవీన్ నే తన ప్రమాదం విషయం వెల్లడించారు. కానీ ఇక్కడ ఒకటే అనుమానం ఈ ఏడాది ఆరంభంలోనో, గత ఏడాది చివరిలోనో ప్రమాదం జరిగితే ఇప్పటికీ అలాగే వుండడం ఏమిటి? అసలు ఏమిటా ప్రమాదం? ఏం జరిగింది? కోలుకోవడానికి ఇంకా ఎన్నాళ్లు పడుతుంది అన్నదే.
త్వరలోనే అప్ డేట్ ఇస్తా అంటున్నారు కనుక, నవీన్ త్వరలో ఇక అమెరికా వాసం వదిలేసి, ఇండియా వస్తారని అనుకోవాలి. మంచి సినిమా అప్ డేట్ తో తన ప్రేక్షకులను అలరిస్తారన్న మాట.