ఫ్లాప్ ఎఫెక్ట్.. ప్లాన్ మార్చిన కమల్ హాసన్

భారతీయుడు-2 సినిమా ఫ్లాప్ అయింది. దాదాపు 12 నిమిషాలు నిడివి తగ్గించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న వసూళ్ల కంటే, ఎంత నష్టం వస్తోందనే లెక్కలతో బయ్యర్లు తలమునకలై ఉన్నారు. ఈ సినిమా ప్రభావం భారతీయుడు-3పై పడింది.

భారతీయుడు-2తో పాటు, పార్ట్-3 షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. లెక్కప్రకారం మరో 5-6 నెలల్లో భారతీయుడు-3 కూడా థియేటర్లలోకి రావాలి. కానీ ఇప్పుడీ సినిమా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

భారతీయుడు-3 సినిమా కోసం కమల్ హాసన్ నెల రోజులు వర్క్ చేయాల్సి ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడీ ప్రాజెక్టును కొన్నాళ్లు ఆపాలని కమల్ హాసన్ నిర్ణయించుకున్నాడు.

భారతీయుడు-3 కంటే మణిరత్నం దర్శకత్వంలో కమల్ చేస్తున్న సినిమా ముందుగా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మాత్రమే భారతీయుడు-3 విడుదలవుతుంది. అటు శంకర్ కూడా దాదాపు దీనికి అంగీకరించాడు. చేతిలో ఉన్న గేమ్ ఛేంజర్ పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి, ఆ తర్వాత భారతీయుడు-3 పనులు మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు. అదృష్టం కలిసొచ్చి గేమ్ ఛేంజర్ హిట్టయితే, భారతీయుడు-3కి అది కలిసొస్తుందని అంతా భావిస్తున్నారు. Readmore!

Show comments

Related Stories :