నో ఫైనాన్స్ టు టాప్ ప్రొడ్యూసర్!

ఆయనో పెద్ద నిర్మాత. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడం టాలీవుడ్‌లో ఎంత సేపు. ఇట్టే టేబుల్ టర్న్ అయిపోతుంది. సరైన హిట్ లు రెండు పడితే ఒకలా వుంటుంది. ఫ్లాపులు పలకరిస్తే మరోలా వుంటుంది. సదరు టాప్ ప్రొడ్యూసర్ కు ఇటీవల టైమ్ అంత బాగున్నట్లు లేదు.

పట్టిన ప్రాజెక్ట్ లు సరైనవి కాకపోవడమో, ఫెయిల్ కావడమో, చేసే పనుల్లో నష్టాలు పలకరించడమో జరుగుతూ వస్తోంది. పైగా చేతిలో వరుసగా ప్రాజెక్ట్ లు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. ఎందుకంటే వున్నది, తెచ్చింది అంతా ఓ వైట్ ఎలిఫెంట్ లాంటి ప్రాజెక్ట్ మీదకు వెళ్లిపోతోంది.

ఇలాంటి టైమ్ లో ఇటీవల ఓ ప్రాజెక్ట్ విడుదలకు కూడా లాస్ట్ మినిట్ లో టెన్షన్ పడ్డారు. ఫైనాన్స్ క్లియరెన్స్ రావడం ఇబ్బంది అయింది. ఇప్పుడు మళ్లీ కాస్త ఫైనాన్స్ కావాలని ఓ పెద్ద ఫైనాన్సియర్ ను సంప్రదిస్తే నో అనే ఆన్సర్ ఎదురుకావడం కాస్త షాకింగ్ అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అంత పెద్ద నిర్మాత అడిగితే ఏ ఫైనాన్సియర్ కాదనరు. కానీ ఎందుకో ఇక్కడ మాత్రం నో అనే ఆన్సర్ ఎదురైంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే సినిమా బేస్డ్ గా ఫైనాస్స్ అడిగితే కాదని అనరని, ప్రాజెక్ట్ ఫైనాన్స్ అనేది ఎప్పుడూ దొరుకుతుందని, అలా కాకుండా ఇప్పటికే చాలా ఫైనాన్స్ లు వున్న వైట్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ కోసం ఫండింగ్ అడగడంతో నో అనే ఆన్సర్ వచ్చిందని ఇండస్ట్రీలో వివరణ కూడా వినిపిస్తోంది. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ఆ నిర్మాతకు కాస్త ఇబ్బందికర పరిస్థితే.

Readmore!

Show comments

Related Stories :