‘టీ..బ్యాడ్…టైమ్’

టీ టైమ్ అనే ఫ్రాంచైజీలతో తెలుగు నాట టీ అలవాటను బాగా పెంచిన వ్యక్తి తంగెళ్ల ఉదయ్..అలియాస్ టీ టైమ్ ఉదయ్. తూర్పు గోదావరి కడియం దగ్గరలో ఒక చిన్న టీస్టాల్ స్టార్ట్ చేసాడు. చాలా క్లాస్ గా, నీట్ గా వున్న ఈ స్టాల్ అచిరకాలంలోనే జనాలను ఆకట్టుకుంది. దాంతో దాన్నే కాన్సెప్ట్ గా చేసుకుని, ఫ్రాంచైజీలు ఇస్తూ కోట్లు సంపాదించాడు. ఇది చూసి చాలా అంటే చాలా టీ చైన్ కేఫ్ లు పుట్టుకువచ్చాయి. అంతవరకు కథ బాగానే వుంది. ఓ సక్సెస్ స్టోరీగా బాగానే పనికి వచ్చింది.

కానీ అక్కడితో ఆగకుండా రాజకీయాల్లోకి వచ్చి, జనసేన తరపున పోటీకి దిగేసరికి తంగెళ్ల ఉదయ్ అసలు చరిత్ర అంతా తవ్వి తీస్తున్నారు. అసలు టీటైమ్ ఉదయ్ నిజంగా టీటైమ్ మీదనే ఇంత ఆదాయం సంపాదించారా? అసలు అతని చదువు ఏమిటి? గతంలో చేసిన ఉద్యోగాలు ఏమిటి? అన్నీ తవ్వి తీస్తున్నారు. శ్రీశ్రీ అన్నట్లు..పబ్లిక్ లోకి వస్తే ఇలాగే వుంటుంది.

ఇప్పటి వరకు ఉదయ్ తాను ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నో, ఎలక్ట్రానిక్ ఇంజనీర్ నో అని చెప్పుకుంటూ వచ్చారు. దుబాయ్ లో ఉద్యోగం చేసారు అని ప్రచారం వుంది. కానీ ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్ లో మాత్రం జస్ట్ ఇంటర్ మాత్రమే చదువు అని క్లారిటీ వచ్చేసింది. అంటే ఇప్పటి వరకు ప్రచారంలో వున్నదంతా అబద్దం అన్నమాట.

ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం కూడా వుంది. దుబాయ్ లో క్రికెట్ బెట్టింగ్ లు నిర్వహించేవాడని ఇప్పుడు ప్రత్యర్ధులు సోషల్ మీడియాలో చలామణీ చేస్తున్నారు. ఈ మేరకు దుబాయ్ లో ఓ కేసు వుందని, లుక్ అవుట్ నోటీసు వుందని ప్రచారం జరుగుతోంది.  ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని డాక్యుమెంట్లు కూడా చలామణీ అవుతున్నాయి.

చూస్తుంటే ఉదయ్ టీ టైమ్ చరిత్ర మొత్తం ఎన్నికల ప్రచార అంశంగా మారబోతున్నట్లు కనిపిస్తోంది. ఇంటర్ చదవడం, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని చెప్పుకోవడం, రెండు పాన్ కార్డులు కలిగి వుండడం, దుబాయ్ లుక్అవుట్ నోటీస్ ఇవన్నీ ఇక కాకినాడలో ఎన్నికల ప్రచార అస్త్రాలు కాబోతున్నాయన్నమాట.

Show comments

Related Stories :