ఫ్యామిలీ స్టార్ మరోసారి కార్నర్ అయ్యాడు

భారీ అంచనాలతో వచ్చిన ఓ పెద్ద సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ ట్రోలింగ్ అక్కడితో ఆగిపోవట్లేదు. సదరు సినిమా ఓటీటీలోకి వచ్చినప్పుడు ఫ్రెష్ గా మరోసారి మొదలవుతోంది. మొన్న గుంటూరుకారం విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది.

గీతగోవిందం కాంబినేషన్.. హాట్ బ్యూటీ మృణాల్.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. గోపీసుందర్ మ్యూజిక్.. భారీ తారాగణం.. ఇలా భారీ సెటప్ తో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది. కొన్ని రోజులకు కుటుంబ ప్రేక్షకులు తరలివస్తారని భావించిన యూనిట్ కు చేదు ఫలితమే మిగిలింది.

అలా థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమా, తాజాగా ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలోకి వచ్చినప్పుడు సినిమాపై ఏ రేంజ్ లో ట్రోలింగ్ నడిచిందో, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా అదే స్థాయిలో సినిమాపై ట్రోల్స్ పడుతున్నాయి. నెటిజన్లు ఈ మూవీని దుమ్మెత్తిపోస్తున్నారు. సినిమాలో మేకర్స్ మిస్సయిన లాజిక్స్ అన్నింటినీ క్లిప్పింగ్స్ తో పాటు మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు.

దోశ వేసే సన్నివేశం, సెకెండాఫ్ లో హీరో అందర్నీ చితక్కొట్టే సీన్, రవిబాబుకు వార్నింగ్ ఇచ్చే సీన్ తో పాటు మరిన్ని సన్నివేశాలపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈసారి విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీపై కూడా పోస్టులు పడడం మొదలయ్యాయి. ఫ్యామిలీ స్టార్ కు ఈ 2 రోజులు ఇది తప్పదు. ఆ తర్వాత అంతా చల్లారిపోతుంది.

Show comments

Related Stories :