ఎత్తు తక్కువున్నా ఓకే అంటున్న హీరోయిన్

ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఎతైన హీరోయిన్ ఎవరంటే ఫరియా అబ్దుల్లా. ప్రభాస్ లాంటి ఆజానుబాహుడు సైతం ఆశ్చర్యపోయేంత హైట్ ఆమె సొంతం. మరి ఇలాంటి పొడుగు కాళ్ల సుందరికి అంతకంటే హైట్ ఉండే అబ్బాయి కావాలి కదా? అది సాధ్యమేనా?

ఫరియా మాత్రం ఈ విషయంలో ఏకీభవించడం లేదు. తనకు కాబోయే భర్త తనకంటే ఎత్తులో కాస్త తక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి అభ్యంతరం లేదంటోంది. అయితే ఓ క్వాలిటీ మాత్రం తప్పనిసరిగా ఉండాలని చెబుతోంది.

"కాబోయే భర్త నా కంటే కాస్త తక్కువ ఎత్తు ఉన్నప్పటికీ నాకు ఓకే. కాకపోతే అతడిలో మంచి హాస్య చతురత ఉండాలి. అలాంటి ఫన్ కుర్రాడు దొరికితే, నా కంటే కాస్త పొట్టిగా ఉన్నా పెళ్లి చేసుకుంటాను. ఈ జీవిత ప్రయాణంలో అన్నీ బాధలే. కనీసం కట్టుకోబోయేవాడు ఫన్ గా ఉంటే బాగుంటుంది కదా."

ఇలా తన మనసులో మాట బయటపెట్టింది ఫరియా. ఒకవేళ మ్యాట్రిమోనీ సైట్ లో తన వివరాలు వెల్లడించాల్సి వస్తే, కొన్ని విషయాల్ని మాత్రం దాచిపెడతానంటోంది.  

"మ్యాట్రిమోనీ సైట్ లో వివరాలు ఇస్తూ ఏదైనా దాచిపెట్టాల్సి వస్తే నేను హీరోయిన్ అనే విషయాన్ని దాచిపెడతాను. ఫొటో కూడా లైట్ గా బ్లర్ చేస్తాను. నటి అని తెలిస్తే ఆటోమేటిగ్గా రకరకాల ఆలోచనలు, అంచనాలు వచ్చేస్తాయి. అదే నేను హీరోయిన్ ను కాదని తెలిస్తే ఎదుటి వ్యక్తి నుంచి నిజాలు బయటకొస్తాయి."

అల్లరి నరేష్ సరసన 'ఆ ఒక్కటి అడక్కు' అనే సినిమా చేసింది ఫరియా. ఇన్నాళ్లకు తన ఎత్తుకు సరితూగే హీరోతో నటించానని సరదాగా జోక్ చేసింది.

Show comments

Related Stories :