ఈసారి రాజమౌళి స్టోరీలైన్ బయటపెడతాడా?

రాజమౌళి సినిమాలకు సంబంధించి ఓ స్పెషాలిటీ ఉంది. తన సినిమాలకు సంబంధించి ముందే స్టోరీలైన్ చెప్పేస్తుంటాడు ఈ స్టార్ డైరక్టర్. పూర్తిగా కాకపోయినా నేపథ్యం ఏంటి, పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని చూచాయగా వెల్లడిస్తాడు.

మగధీర, ఈగ, మర్యాదరామన్న, బాహుబలి, ఆర్ఆర్ఆర్.. ఇలా తన ప్రతి సినిమాకు రాజమౌళి ముందే లైన్ ఏంటనేది చెప్పేశాడు. ఈసారి కూడా అదే పద్ధతి ఫాలో అవ్వబోతున్నాడు.

మహేష్ తో సినిమా చేస్తున్నాడు జక్కన్న. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జోరుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇప్పటికే స్క్రీన్ ప్లే లాక్ చేసిన దర్శకుడు.. నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపికలో బిజీగా ఉన్నాడు.

ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నాడు. అదే ప్రెస్ మీట్ లో రాజమౌళి, మూవీకి సంబంధించి స్టోరీలైన్ వెల్లడించే అవకాశం ఉంది.

రాజమౌళి-మహేష్ కాంబోలో రాబోతున్న సినిమా నేపథ్యం ఏంటనేది ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్ కొంచెంకొంచెం వెల్లడించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రెస్ మీట్ లో రాజమౌళి మరిన్ని వివరాలు వెల్లడించబోతున్నారు. 

ఈ ప్రాజెక్టుపై మార్కెట్లో చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి. లెక్కలేనన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. స్టార్ కాస్ట్, టెక్నీషియన్స్ తో పాటు, బడ్జెట్ లెక్కలపై ఏవేవో కథనాలు కనిపిస్తున్నాయి. వాటన్నింటికీ సింగిల్ ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇవ్వబోతున్నాడు రాజమౌళి. అందుకే ఆ మీడియా సమావేశం కోసం అందరూ వెయిటింగ్.

Show comments

Related Stories :