స్టార్ యూట్యూబర్ షణ్ముక్ అడ్డంగా దొరికిపోయాడు. అతడు గంజాయి తాగినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో షణ్ముక్ పై కేసు నమోదైంది. షణ్ముక్ ఇంటి నుంచి 16 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇంతకీ ఏ మేటర్ ఎలా బయటపడిందంటే... షణ్ముక్ కు సంపత్ అనే సోదరుడు ఉన్నాడు. అతడు ఓ అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పలు స్టార్ హోటల్స్, రిసార్ట్స్ లో ఆమెపై అత్యాచారం చేశాడు.
సంపత్ తనను పెళ్లి చేసుకుంటాడని ఇన్నాళ్లూ ఎదురుచూసింది ఆ అమ్మాయి. అయితే ఈమధ్యే ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. సంపత్ కు ఆల్రెడీ పెళ్లి అయిందట. దీంతో ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది.
కేసు నమోదు చేసిన పోలీసులు, నానక్ రామ్ గూడలోని సంపత్ ఇంటికి వచ్చారు. అక్కడే షణ్ముక్ కూడా ఉన్నాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి చూసిన పోలీసులకు, అతడు గంజాయి తాగినట్టు నిర్థారణకొచ్చారు.
వెంటనే సోదాలు జరపగా, షణ్ముక్ ఇంట్లో గంజాయి దొరికింది. ఈరోజు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతడు గంజాయి సేవించినట్టు నిర్థారణ అయింది.
దీంతో షణ్ముక్ పై కేసు నమోదు చేశారు. అతడి సోదరుడు సంపత్ పై చీటింగ్, రేప్ కేసులు నమోదు చేశారు. అన్నదమ్ములిద్దర్నీ రిమాండ్ కు తరలించారు.