సంక్రాంతికి పోటా పోటీగా వస్తున్నాయి అయిదు సినిమాలు. కాస్త అటు ఇటుగా వెళ్తాయా? డేట్ లు మారుతాయా? అన్నది పక్కన పెడితే, సంక్రాంతి టార్గెట్ గా రెడీ అవుతున్నాయి.
సంక్రాంతికి లీడ్ లో వున్న సినిమా మహేష్ బాబు గుంటూరుకారం. ఈ సినిమా వర్క్ ఈ నెలాఖరుతో పూర్తవుతుంది. ప్రస్తుతం పాట షూటింగ్ జరుగుతోంది. 28 నాటికి తన వర్క్ పూర్తి చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు వెళ్తారు మహేష్ బాబు. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లు అంటే మొత్తం మీద ఈ నెలాఖరుకు షూటింగ్ వర్క్ అయిపోతుంది.
గుంటూరు కారంతో పాటు వస్తున్న హనుమాన్, ఈగిల్, సైంధవ్, సినిమాలు ఎప్పుడో రెడీ అయిపోయాయి. మిగిలింది నా సామి రంగా మాత్రమే. నాగ్ ఈ సినిమాను సూపర్ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నాడు. మొత్తం టాకీ పూర్తయిపోయింది. ఓ మాస్ నెంబర్ ను ఫస్ట్ వీక్ లో షూట్ చేసి గుమ్మడికాయ కొట్టేస్తారు.
సైంధవ్ ట్రయిలర్ న్యూ ఇయర్ కు వస్తుంది. ఆరున గుంటూరు కారం ట్రయిలర్ వుంటుంది. నా సామి రంగా ట్రయిలర్ ఎప్పుడు వుంటుందన్నది తెలియాల్సి వుంది.
ఇదిలా వుంటే సినిమా విడుదల తేదీల మీద ఇప్పుడు మీటింగ్ లు ఇంకా జరగాల్సి వుంది. 11 వ తేదీకి ఏదో ఒక సినిమాను పంపాలనే ప్రయత్నాలు వున్నాయి. అయితే అది ఈగిల్ నా? హనుమాన్ నా? అన్నది తేలాల్సి వుంది.