గిల్డ్ ఏం చేస్తోంది? దిల్ రాజు ఎక్కడ?

ఇవీ ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్న ప్రశ్నలు. సంక్రాంతికి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు అయిదు సినిమాలు రుమాళ్లు వేసి, వచ్చి తీరతాము అని హడావుడి చేస్తుంటే, అందరినీ కూర్చో పెట్టి, సర్ది చెప్పి, అన్నీ సెట్ చేయాల్సిన యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎక్కడ వుంది? దాని పెద్ద అయిన దిల్ రాజు ఏం చేస్తున్నారు అన్నది మరో ప్రశ్న.

కొన్ని సినిమాలు ఏనాడో సంక్రాంతి అన్నాయి. మరి కొన్ని సినిమాలు తప్పక సంక్రాంతికి వచ్చాయి. ఇంకొన్ని సినిమాలు సంక్రాంతికే రావాలనుకుంటున్నాయి. ఇలా మొత్తం మీద సంక్రాంతికి అయిదు సినిమాలు జమ అయ్యాయి.

ఎవరికి ఎవరూ తగ్గడం లేదు. నిర్మాతలు తగ్గడం లేదు. హీరోలు తగ్గడం లేదు. బయ్యర్లు అంతకన్నా తగ్గడం లేదు. గుంటూరు కారం.. మహేష్ బాబు.. త్రివిక్రమ్ అందువల్ల వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. సైంధవ్-వెంకటేష్ హీరో. థియేటర్ల సమస్య లేనే లేదు. అందువల్ల వెనక్క తగ్గడం లేదు.

ఈగిల్ సినిమాకు హీరో రవితేజ. సంక్రాంతికి తన సినిమా తప్పని సరిగా రావాలని కోరుకుంటున్నారు. ఇక హనుమాన్ సినిమాది మరో రకం సమస్య. ఆ సినిమా ఈ డేట్ కే వచ్చి తీరాలి. నార్త్ లో అయోధ్య రామ జన్మభూమి ప్రతిష్ట కార్యక్రమం లోపు ఆ సినిమా విడుదల చేయాలన్నది ప్లాన్. అదీ సమస్య. Readmore!

ఇవన్నీ అలా వుంటే సీనియర్ హీరో నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్. అందుకే చాలా అంటే చాలా అర్జంట్ గా ‘నా సామి రంగ’ సినిమాను రెడీ చేయించేసారు. 15న విడుదల చేయాలని ఆలోచన వుంది.

12న‌ రెండు సినిమాలు. అంటే మహేష్ కు డే వన్ రికార్డు కు అడ్డంకి. 13న రెండు సినిమాలు అంటే రెండో రోజునే అందరూ కలిసి కలెక్షన్లు పంచుకోవాలి. ఇలా అయితే ఎలా? అందుకే ఇప్పుడు గిల్డ్ రంగ ప్రవేశం చేయాలి. డేట్ లు కాస్త అటు మార్చాలి. జరుగుతుందా? ఏమో? వెయిట్ అండ్ సీ.

Show comments

Related Stories :