నాని-బలగం వేణు-యల్లమ్మ!

అప్పటి వరకు తనను జస్ట్ ఓ కమెడియన్ గా చూసిన వాళ్లందరినీ అవాక్కయ్యేలా చేసాడు వేణు తన బలగం సినిమాతో. ఆ తరువాత సినిమాను కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేయాలని అక్కడే వున్నాడు. 

ఈసారి వేణుతో పెద్ద సినిమా చేయాలన్నది దిల్ రాజు ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం కథ తయారు చేసుకుంటూ అక్కడే వున్నాడు. కథ ఇప్పుడు రెడీ అయినట్లు తెలుస్తోంది. యల్లమ్మ అనే వర్కింగ్ టైటిల్ తో రాసుకున్న ఈ కథను హీరో నానికి చెప్పాలన్నది ఆలోచన.

నానికి లైన్ ఇప్పటికే చెప్పారు. కథ పూర్తిగా నెరేషన్ ఇవ్వాల్సి వుంది. నాని కూడా కథ నచ్చితే బలగం వేణుతో సినిమా చేయాలనే వుందని, తాను రెడీ అని అంటున్నారు. అందువల్ల ఇక నెరేషన్ ఒక్కటే బకాయి. హాయ్ నాన్న సినిమా తరువాత వెకేషన్ కమ్ ప్రమోషన్ అన్నట్లుగా అమెరికా వెళ్తున్నారు నాని. అట్నుంచి వచ్చాక వింటారేమో కథ.

ప్రస్తుతానికి అయితే ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కించాలని నిర్మాత దిల్ రాజు అయితే చాలా ఆసక్తిగా వున్నారు. నాని ఒక సినిమా తరువాత మరో సినిమా చేస్తూ వస్తున్నారు. హాయ్ నాన్న తరువాత సరిపోదా శనివారం సినిమాను వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో చేయాల్సి వుంది. Readmore!

Show comments

Related Stories :