సీనియర్ నటుడు కూతురు పెళ్లికి రెడీ

మరో సెలబ్రిటీ వివాహానికి రంగం సిద్ధమైంది. సౌత్ సీనియర్ నటుడు ప్రభు, తన కుమార్తె కు పెళ్లి చేయబోతున్నారు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తో ప్రభు కుమార్తె ఐశ్వర్య పెళ్లి ఖాయమైనట్టు కోలీవుడ్ నుంచి వార్తలొస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

ప్రభు కుమార్తె, లెజెండ్ శివాజీ గణేశన్ మనవరాలు అయిన ఐశ్వర్యకు ఇంతకుముందే పెళ్లయింది. 2008లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ పెళ్లి నిలవలేదు. ఆ తర్వాత చాన్నాళ్ల పాటు అమెరికాలో ఉండిపోయిన ఐశ్వర్య రీసెంట్ గా చెన్నై వచ్చారు.

మార్క్ ఆంటోనీ దర్శకుడు అధిక్ రవిచంద్రన్, ఐశ్వర్య స్నేహితులు. ఒకరికొకరు బాగా తెలుసు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నారు. వీళ్ల పెళ్లికి ప్రభు కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది.

తమిళ్ లో మార్క్ ఆంటోనీతో పెద్ద హిట్ కొట్టాడు దర్శకుడు అధిక్. దీంతో ఏకంగా అజిత్ తో సినిమా చేసే అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఆ సినిమా పని మీదే ఉన్నారు. ఇక ఐశ్వర్య తండ్రి ప్రభు, సౌత్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఐశ్వర్య సోదరుడు విక్రమ్ ప్రభు కూడా కోలీవుడ్ లో ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు.

Show comments

Related Stories :