హీరోలు.. తగ్గేదేలే

ఒకపక్క నాన్ థియేటర్ రైట్స్ రాక ఎక్కడ సినిమాలు అక్కడ ఆగిన పరిస్థితి. ప్రీ ప్రొడక్షన్ దశలో వున్న మిడ్ రేంజ్, స్మాల్ రేంజ్ సినిమాలు అన్నీ ఎక్కడివి అక్కడ ఆగాయి. ఇలాంటి సమయంలో అంతా కూర్చుని సినిమాల ఖర్చును ఎలా తగ్గించాలా అన్నది డిసైడ్ చేసుకోవాల్సి వుంది. ఇది మంచి సమయం ఇప్పుడే కరెక్షన్ చేసుకోవాలని అంతా అంటున్నారు. కానీ ఒక్క హీరోలు తప్ప. వాళ్లు మాత్రం ఇంకా తమ రెమ్యూనిరేషన్ లు మాత్రం తమకు ఇవ్వాల్సిందే అనే టైపులో వ్యవహరిస్తున్నారు.

ఓ మిడ్ రేంజ్ హీరో సినిమా విడుదలకు రెడీ అయింది. మార్కెట్ సరిగ్గా కాలేదు. కానీ తన పాతిక కోట్లు తనకు ఇవ్వాల్సిందే అని పట్టు పట్టారు. దాంతో నిర్మాతలు చేతులు ఎత్తేస్తే, ఆంధ్ర, సీడెడ్, ఓవర్ సీస్ థియేటర్ మార్కెటింగ్ ను తన చేతుల్లోకి తీసుకున్నారు హీరో అని తెలుస్తోంది. తన మనషులతో సినిమాను తానే పంపిణీ చేసే పనికి దిగారు.

ఓ పెద్ద ప్రొడ్యూసర్ ఓ సీనియర్ హీరోతో సినిమా చేయాలనుకున్నారు. లైన్ అన్నీ చెప్పారు. ఓకె అయింది. కానీ రెమ్యూనిరేషన్ 65 కోట్లు అని ఫీలర్ పంపారు. దాంతో నిర్మాత సైలంట్ అయ్యారు. 40 కోట్లు అయితే చేద్దామని నిర్మాతకు వుంది. కానీ ఆ సీనియర్ హీరో దిగి రావడం లేదు.

మరో సంస్థ ఓ సీనియర్ హీరోతో సినిమా ప్లాన్ చేసింది. 115 కోట్లు పేపర్ మీద ఖర్చు కనిపించి ఆగింది. హీరో రెమ్యూనిరేషన్ పాతిక కోట్లకు పైగానే. ఆయన కనుక ఓ పది కోట్లు తగ్గించుకుంటే ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది. కానీ తగ్గించుకునే పరిస్థితి లేదు. వేరే సంస్థ పాతిక కోట్లు ఇచ్చి ప్రాజెక్ట్ చేయడానికి సిద్దంగా వుంది. అందువల్ల హీరో ఎందుకు తగ్గుతారు. Readmore!

మరో మిడ్ రేంజ్ హీరో సినిమా ఓ నిర్మాత దగ్గర నుంచి మరో నిర్మాత దగ్గరకు వెళ్లింది. హీరో రెమ్యూనిరేషన్ పది కోట్లు అంటున్నారు. దాంతో నలబై కోట్ల వరకు వెళ్తోంది బడ్జెట్. నాన్ థియేటర్ ఆదాయం వుంటే ఓకె. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. థియేటర్ మార్కెట్ తిప్పి తిప్పి కొడితే పదిహేను కోట్లు వుండదు. దాంతో ఆ ప్రాజెక్టు అలా డిస్కషన్ లో వుంది.

నిర్మాతలు ప్రాజెక్ట్ వస్తే చాలు అని చూస్తున్నారు. దాంతో హీరోలు తగ్గడం లేదు. ఒకరు కాకుంటే మరొకరు అనే ధోరణిలో వున్నారు అని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

Show comments

Related Stories :