స్టింగ్ ఆపరేషన్ ఎఫెక్ట్.. శర్మ రాజీనామా!

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ త‌న ప‌దవికి రాజీనామా చేశారు. ఒక జాతీయ‌ మీడియా చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో టీమిండియా క్రికెటర్లపై చేసిన వాఖ్య‌లు వివాదాస్పదం అవ్వ‌డంతో చేత‌న్ శ‌ర్మ రాజీనామా చేశారు. అత‌ని రాజీనామాను బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా ఆమోదించిన‌ట్లు స‌మాచారం.

ఒక మీడియా చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో శర్మ మాట్లాడుతూ..  విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాతో పాటు జట్టులోని ఇతర ఆటగాళ్లపై అనుచిత‌ వ్యాఖ్యలు చేసాడు. అలాగే.. 80 నుంచి 85 శాతం ఫిట్‌గా ఉన్నప్పటికీ చాలా మంది ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ ప్రూవ్‌ చేసుకునేందుకు ఇంజక్షన్లు వాడతారని.. అవి డోపింగ్‌ టెస్ట్‌కు సైతం చిక్కని అధునాతన ఔషదాలంటూ.. సంచలన కామెంట్స్ చేశాడు.

మాజీ కెప్టెన్ కోహ్లి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య ఇగో గొడవ ఉందని శర్మ అన్నారు. చేతన్‌ శర్మ భారత క్రికెటర్ల గురించి మాట్లాడిన మాటలు వివాదానికి తీయ‌డంతో బీసీసీఐ నుండి వేటు తప్పదని భావించినా అతడే రాజీనామా చేయడం గమనార్హం.

Show comments

Related Stories :