ఆ ‘ఇద్దరూ’ చెట్టపట్టాల్!

ముద్దుగా బబ్లీగా, మెరుపులాంటి చూపులతో పక్కింటి పిల్ల మాదిరిగా భలే వుంటుందా హీరోయిన్. నటన విషయంలో కూడా తీసిపోదు. తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా ఫలానా సినిమా లేదా ఫలానా హీరోయిన్ అనగానే గుర్తువచ్చేంత గుర్తింపు అయితే ఉంది. 

ఇప్పుడు ఈ అమ్మడు ఓ కుర్ర హీరోతో మాంచి సాన్నిహిత్యంతో వుందని టాలీవుడ్ లో బలమైన గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ ఇన్నోసెంట్ లుక్స్ యంగ్ హీరో తో ఈ అమ్మడు ఓ సినిమా చేసింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య బలంగా స్నేహం చిగురించి అలా అలా డేటింగ్ కు దారి తీసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకునే వెళ్తున్నారట. 

ఇదేమీ కొత్త సంగతి, వింత..విడ్డూరం కాదని, అందరికీ తెలిసిన సంగతే అని, ఇరు వైపులా ఇళ్లలో కూడా అంగీకారమే అని వినిపిస్తోంది. అంటే బహుశా ఏదో వన్ ఫైన్ మార్నింగ్ పెళ్లి పీటలు ఎక్కుతారేమో?

టాలీవుడ్ లో ఇప్పుడు ప్రేమలు..పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. చాటు మాటు వ్యవహారాలు లేవు ఇప్పుడు. అంతా ఓపెన్ నే. కుర్రకారు ప్రేమలు..డేటింగ్ లు కూడా.

Show comments

Related Stories :