సాగర సంగమం డ్రెస్ అడిగిన ప్రభాస్

కమల్ హాసన్ నటించిన క్లాసిక్ సాగర సంగమం. ఈ సినిమా మొత్తం దాదాపు ఒకే కాస్ట్యూమ్ లో కనిపిస్తారు కమల్ హాసన్. అలాంటి డ్రెస్ ప్రభాస్ వేసుకుంటే ఎలా ఉంటుంది..? సాగర సంగమంలో కమల్ హాసన్ లా డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ కోరిక ప్రభాస్ కు బాగా ఉండేదంట.

ఈ విషయాల్ని స్వయంగా ప్రభాస్ బయటపెట్టాడు. చిన్నప్పుడు కమల్ హాసన్ నటించిన సాగర సంగమం సినిమా చూసి అలాంటి డ్రెస్ కావాలని ఇంట్లో మారాం చేశాడట. ఆ డ్రెస్ వేసుకుంటే, అలా డాన్స్ చేయొచ్చని భావించేవాడట. కానీ కమల్ హాసన్ లా తల కూడా తిప్పలేకపోయానని చెప్పుకొచ్చాడు.

కల్కి మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ ఫన్నీ విషయాన్ని షేర్ చేశాడు ప్రభాస్. కల్కి సినిమాకు సంబంధించి ఈ రోజు 'బుజ్జి'ని పరిచయం చేశారు. స్వయంగా ప్రభాస్ ఎంతో హైప్ ఇచ్చిన ఈ బుజ్జి ఓ కారు అనే విషయం తెలిసిందే.

ఆ కారును ఈరోజు ఆవిష్కరించారు. స్వయంగా ప్రభాస్ బుజ్జిపై కూర్చొని విన్యాసాలు చేశాడు. రయ్ మంటూ కారులో దూసుకొచ్చి ప్రేక్షకులముందు వాలాడు. ఏమాటకామాట బుజ్జి డిజైన్ అదిరింది. దానికి బ్రెయిన్ యాడ్ చేయడం, దాంతో ప్రభాస్ మాట్లాడ్డం చాలా బాగుంది. Readmore!

ఇంతకుముందు విడుదల చేసిన వీడియోల్లానే బుజ్జి గ్లింప్స్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఈ సినిమా ప్రచారం కోసం తొలిసారి భైరవ గెటప్ లో మీడియా ముందుకొచ్చాడు ప్రభాస్. ఇంతకుముందు అతడు ఈ గెటప్ లో కేవలం క్రికెట్ మ్యాచుల మధ్యలో మాత్రమే కనిపించిన సంగతి తెలిసిందే.

Click Here More Pics

Show comments

Related Stories :