చిరంజీవిని జగన్ నిజంగానే అవమానించారా..?

"చిరంజీవిని పిలిచి మరీ అవమానించారు జగన్. ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడేలా చేశారు. కేంద్రం ఆయనకు పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. అలాంటి వ్యక్తిని జగన్ అవమానించారు." తన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలివి. దీనికి ఆధారాలుగా అప్పట్లో ఎల్లో మీడియా ప్రచురించిన ఫొటోల్ని ట్విట్టర్ లో పోస్టు చేస్తున్నారు టీడీపీ జనాలు.

ఇంతకీ నిజం ఏంటి? చిరంజీవిని సీఎం జగన్ నిజంగానే అవమానించారా? జగన్ కు అంత అవసరం ఏంటి? ఆ ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి పోసాని కృష్ణమురళి ఈ అంశంపై స్పందించారు. నిజానికి చిరంజీవిని జగన్ అవమానించలేదని, స్వయంగా చిరంజీవే జగన్ ను అవమానించారని అసలు విషయం బయటపెట్టారు.

"చిరంజీవి, మహేష్, కొరటాల శివ, ప్రభాస్, రాజమౌళి, నారాయణమూర్తి వచ్చారు. చిరంజీవిని చూడగానే జగన్ దండం పెట్టారు. అన్నా అని పిలిచారు. తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఆ సమావేశంలో చిరంజీవి గారే జగన్ గారిని అవమానించారు. టికెట్ రేట్లు పెంచమని అడిగారు. ఆ సందర్భంగా చాలా మాటలు అన్నారు. టికెట్ రేట్లపై మాట్లాడుతూ.. మీరు ఏమన్నా అనుకోండి, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అనుకోండి, లేదా రిక్వెస్ట్ అనుకోండి, మాకు టికెట్ రేట్లు పెంచి తీరాల్సిందే అని చిరంజీవి అన్నారు."

ముఖ్యమంత్రిని ముందు పెట్టుకొని 'హెచ్చరిస్తున్నాం' అనే పదం వాడారంట చిరంజీవి. మరో వ్యక్తి ఆ మాట అంటే సెక్యూరిటీ వాళ్లు చొక్కా పట్టుకొని బయటకు లాక్కెళ్లేవారని, కానీ చిరంజీవిపై గౌరవంతో జగన్ నవ్వుతూ తలూపారు తప్ప ఏం మాట్లాడలేదని అన్నారు పోసాని.

సాక్ష్యాలు లేకుండా తను మాట్లాడనని.. చిరంజీవి, జగన్ ను ఉద్దేశించి ఆ మాట అన్నారా లేదా అనే విషయాన్ని తను నిరూపిస్తానని, ఇప్పటికీ సీఎంవో ఆఫీసులో ఆ వీడియో ఉందని అన్నారు. పోసాని కౌంటర్ తర్వాతైనా చంద్రబాబు, ఈ అంశాన్ని వదిలేస్తారేమో చూడాలి.

Show comments

Related Stories :